లైఫ్ లో సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ అందరికీ అదే సాధ్యం కాదు. అయితే ఈ రోజుల్లో కూడా చాలామంది వ్యాపారాలు చేసి కోట్లలో సంపాదిస్తున్నారు. ఉద్యోగాలని వదులుకొని కోట్లలో సంపాదిస్తున్న వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. తెలంగాణకు సంబంధించిన ఒక వ్యక్తి సక్సెస్ స్టోరీ చూస్తే ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఆయన ఎవరో కాదు శ్రీకాంత్ బొల్లపల్లి ఆయన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకి చెందిన అతను. వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి. పూల వ్యాపారంతో ప్రతి ఏటా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. 52 ఎకరాల భూమిలో రకరకాల పూలను సాగు చేస్తున్నారు.
200 మందికి పైగా ఉపాధిని కూడా కల్పించారు. ఈ పూల వ్యాపారంతో 70 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నారు. ఈయనను చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు శ్రీకాంత్ పేదరికంలో కూరుకుపోయారు. అయితే వ్యవసాయ కుటుంబంలో అనేక కష్టాలని చూశారు. ఆర్థిక కష్టాల వలన పదవ తరగతితో చదువుని ఆపేశారు. ఆయనకి పదహారేళ్లు ఉన్నప్పుడు బెంగళూరులోని తన కుటుంబ సభ్యుల దగ్గర పూల వ్యాపారం చేసారు.
ఆ టైంలో నెలకి కేవలం 1000 రూపాయలని సంపాదించారు. బెంగళూరు లాంటి మహానగరంలో సొంతంగా వ్యాపారం చేయాలని అనుకున్నారు. కానీ ఈజీ కాదు. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా కొనసాగించారు. పది ఎకరాల్లో పూలసాగుని మొదలుపెట్టారు అది కాస్త 52 ఎకరాలకు చేరింది. 12 రకాల పూలనే సాగు చేస్తున్నారు అంత చిన్న వ్యాపారంతో ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు. ఈయనని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తే చాలామంది సక్సెస్ అవ్వొచ్చు.