కురిసిన డాలర్ల వర్షం.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..!

-

Drivers scramble for cash after bank truck crash leaves it 'raining money'

చిత్తు కాగితాలు, పేపర్లు గాల్లో ఎగిరిపోతే పట్టించుకుంటామా? అస్సలు పట్టించుకోము. మరి.. కరెన్సీ నోట్లు గాల్లో ఎగురుతుంటే.. అప్పుడు పట్టించుకుంటాం.. అంటారా? అవును.. వీళ్లు చేసింది కూడా అదే. కరెన్సీ నోట్లు గాల్లో ఎగురుతుంటే చూస్తూ అలా ఉండలేకపోయారు అందుకే తమ కాళ్లకు పనిచెప్పారు. రోడ్ల మీదనే తమ వాహనాలను వదిలేసి మరి.. గాల్లో ఎగురుతున్న కరెన్సీ నోట్ల కోసం ఎగబడ్డారు. డబ్బులు మరీ అంత ఎవరికి ఎక్కువయ్యాయి.. అసలు.. అవి గాల్లో ఎందుకు ఎగురుతున్నాయి.. ఇవే కదా మీ డౌటనుమానాలు. అవి తీరాలంటే మనం ఓసారి న్యూజెర్సీకి వెళ్లాల్సిందే.

న్యూజెర్సీ ఎక్కడుంటదో తెలుసు కదా. యూఎస్ లో. సరే.. మన టాపిక్ కు వస్తే… ఓ బ్యాంకుకు సంబంధించిన డబ్బును వ్యాన్ లో తీసుకెళ్తున్నారు. వ్యాన్ డోర్లు సరిగా వేయకుండానే అలాగే దాన్ని తీసుకెళ్లడమే వాళ్ల కొంప ముంచింది. రోడ్డు మీద వెళ్తుండగా.. ఆడోర్ కాస్త తెరుచుకుంది. ఇంకేం. వ్యాన్ లోని డబ్బుల కట్టలన్నీ గాలికి ఎగరడం మొదలు పెట్టాయి. న్యూజెర్సీ అంటే అక్కడ డబ్బు డాలర్లలో ఉంటుంది కదా. అక్కడ కొంత సేపు డాలర్ల వర్షం కురిసిందన్నమాట. డాలర్లు గాలిలో ఎగురుతుంటే రోడ్డు మీద పోయే వాహనదారులు చూస్తూ కూర్చుంటారా? వెంటనే తమ వాహనాలను నడి రోడ్డు మీద వదిలేసి ఆ నోట్లను ఏరుకోవడం మొదలు పెట్టారు. దీంతో వెనుక వస్తున్న వాహనాలు ముందున్న వాహనాలను ఢీకొని ఆ ప్రాంతం మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది.

దొరికినోడికి దొరికినంత అని ఎంత దొరికితే అంత దోచుకొని అక్కడి నుంచి ఉడాయించారు వాహనదారులు. దానికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. న్యూజెర్సీలో క్రిస్ మస్ ముందే వచ్చేసిందంటూ నెటిజన్లు కామెంట్లు కూడా పెట్టారు. అయితే కొంతమంది నిజాయితీ పరులు వాళ్లు ఏరుకున్న డబ్బును తీసుకెళ్లి పోలీసులకు ఇచ్చేశారట. మరి కొంతమంది మాత్రం తమ వెంటే తీసుకెళ్లారట. అసలు.. ట్రక్కు నుంచి ఎంత డబ్బు పోయిందనే లెక్కలు వేస్తూ కూర్చున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version