ఆ రెండు గ్రామాల్లో దీపావళి పండుగ జరుపుకోరు.. ఎందుకంటే?

-

అవి తమిళనాడులోని శివగంగ జిల్లాలో ఉన్న కొల్లుకుడిపట్టి, సింగంపునారి గ్రామాలు. దేశమంతా దీపావళి జరుపుకుంటుంది కానీ.. ఈ రెండు గ్రామాలు మాత్రం దీపావళి జరుపుకోవు. టపాసులు పేల్చవు. సంబురాలు చేసుకోవు. ఈ గ్రామస్తులు దీపావళి రోజు కూడా మామూలు రోజుగానే గడుపుతారు. ఎందుకు అలా అంటే దాని వెనుక మానవత్వకోణం ఉంది. మరి.. అదేంటో తెలుసుకుందామా..

ఆ రెండు ఊళ్ల సమీపంలోకి అక్టోబర్, నవంబర్ నెలల్లో కొన్ని రకాల పక్షులు వలస వస్తుంటాయట. సైబీరియా, న్యూజిలాండ్ నుంచి వచ్చిన పక్షులు అక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని మళ్లీ ఎండాకాలం ప్రారంభం కాగానే వాటి ప్రదేశాలకు వెళ్లిపోతాయట. అందుకే.. ఆ ప్రాంతాల్లో టపాసులు కాల్చరు. పెద్ద పెద్ద శబ్దాలు చేయరు. టపాసులు కాల్చితే ఆ శబ్దానికి అవి భయపడి పారిపోతాయని.. దీంతో మళ్లీ అవి అక్కడికి రావని.. జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రెండు ఊళ్ల గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పుడు కాదు.. దాదాపు 10 ఏళ్ల నుంచి ఆ ఊళ్లలో నో దీపావళి. ఆ పక్షులు ఉండే ప్రాంతానికి వెదకుండి బర్డ్ సాంక్ష్యుయరీగా నామకరణం చేశారట. విదేశీ పక్షులను చూడటానికి టూరిస్టులు కూడా అక్కడికి వస్తుంటారట.

ఇటీవలే క్రాకర్స్ కాల్చడంపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది తెలుసు కదా. దేశమంతటా దీపావళి రోజు కేవలం రెండు గంటల పాటే టపాసులు కాల్చాలని సుప్రీం తీర్పునిచ్చింది. జంతుజాలాన్ని పెంపొందించుకోవాలంటే.. పర్యావరణానికి హాని చేయకూడదంటే… టపాసుల వినియోగం తగ్గించాల్సిందేనని సుప్రీం అభిప్రాయపడింది. ఇక.. అర్ధరాత్రి వేడుకలు చేసుకునే క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు మాత్రం కేవలం 35 నిమిషాల పాటే టపాసులు పేల్చాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version