బిడ్డకు సెల్యూట్ చేసిన పోలీస్ తండ్రి… కొంగరకలాన్ సభలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం!

-

పుత్రోత్సాహం తండ్రి పుత్రుడు జన్మించినప్పుడు ఉండదట.. ఆ పుత్రులు నిజంగా గొప్పవాడు అయినప్పుడు ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అది అక్షరాలా నిజం. పుత్రోత్సాహం అంటే కేవలం కొడుకులే కాదు కూతుళ్లు కూడా గొప్ప వాళ్లు అయినప్పుడు ఆ తండ్రి కార్చే కన్నీటి బొట్టు. ఈ పుత్రోత్సాహం ఏంది.. పుత్రికోత్సాహం ఏంది అని కన్ఫ్యూజ్ కాకండి. అసలైన తండ్రీబిడ్డల అనుబంధం గురించి తెలుసుకుందాం పదండి..

ఉమా మహేశ్వర శర్మ.. మల్కాజ్ గిరి డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన కూతురు సింధూ శర్మ 2014 బ్యాచ్ ఐపీఎస్. ప్రస్తుతం జగిత్యాల ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నది. నిన్న కొంగరకలాన్ లో జరిగిన ప్రగతి నివేదన సభలో వీళ్లిద్దరి మధ్య ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రగతి నివేదన సభ బందోబస్తు విధులకు శనివారం ఉమా మహేశ్వర శర్మ వెళ్లారు. అయితే.. అప్పటికే అక్కడ తన కూతురు శర్మ విధులు నిర్వర్తిస్తున్నది. ఆమె పర్యవేక్షిస్తున్న బృందంలోనే ఆయన కూడా పనిచేయాల్సి ఉంది. దీంతో అందరు పోలీసుల్లాగే ఉమా కూడా వెళ్లి తన కూతురుకు(ఎస్పీ సింధూశర్మ)కు సెల్యూట్ చేశాడు. సభ ప్రారంభం దగ్గర నుంచి సభ పూర్తయ్యేదాకా సింధూ శర్మ ఆదేశాల్లోనే ఆయన పనిచేశాడు. ఈ అరుదైన ఘట్టాన్ని మీడియా ప్రతినిధులు తమ కెమెరాల్లో బంధించి కాసేపు తండ్రీకూతుళ్లతో ముచ్చటించారు.

“నా కూతురుతో కలిసి పనిచేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నా కూతురుతో కలిసి పనిచేస్తా అని ఏనాడూ ఊహించలేదు. అయినప్పటికీ పోలీస్ శాఖలో ఇవన్నీ సాధారణం. యూనిఫాం వేసుకున్న తర్వాత బంధాలు, అనుబంధాలు ఏవీ ఉండవు..” అంటూ మహేశ్వర శర్మ తెలిపాడు.

1985 లో ఉమా మహేశ్వర శర్మ ఎస్సైగా పోలీస్ శాఖలో జాయిన్ అయ్యాడు. తర్వాత పదోన్నతులు పొంది ప్రస్తుతం ఎస్పీ(నాన్ కేడర్) హోదాలో పనిచేస్తున్నాడు. వీళ్లు వేర్వేరు ప్రాంతాల్లో తన డ్యూటీలను నిర్వర్తిస్తున్నప్పటికీ.. ప్రగతి నివేదన సభ వీళ్లను కలిపింది. అదీ పుత్రికోత్సాహం అంటే.. ఏమంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version