సైన్స్ లో కొత్త దారులు చూపిన తొలి భారతీయ మహిళ.. ఆసిమా ఛటర్జీ విజయగాథ!

-

సమాజంలో మహిళలు సైన్స్‌లోకి అడుగుపెట్టడమే కష్టమైన ఆ రోజుల్లో, ఒక భారతీయ మహిళ ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసింది. ఆమె ప్రొఫెసర్ ఆసిమా ఛటర్జీ. భారతీయ రసాయన శాస్త్రంలో ఆమె చేసిన కృషి అనిర్వచనీయం. ముఖ్యంగా సహజసిద్ధమైన మొక్కల నుండి ఔషధాలను కనుగొనడంలో ఆమె చూపిన ప్రతిభ ఎందరికో మార్గదర్శకం. భారతీయ సైన్స్‌లో తొలి మహిళా డాక్టరేట్ సాధించిన ఆమె విజయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.

ఆసిమా ఛటర్జీ 1917లో కోల్‌కతాలో జన్మించారు. కలకత్తా యూనివర్శిటీ నుండి డాక్టరేట్ పట్టా పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఆమె పరిశోధన ముఖ్యంగా సేంద్రీయ రసాయన శాస్త్రం (Organic Chemistry) మరియు ఔషధ రసాయన శాస్త్రం (Medicinal Chemistry) రంగాలలో విస్తరించింది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే వింకా ఆల్కలాయిడ్స్ ముఖ్యంగా సర్పగంధ  మొక్కపై ఆమె చేసిన పరిశోధనలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి.

Celebrating Asima Chatterjee – India’s First Woman Scientist to Break Scientific Boundaries
Celebrating Asima Chatterjee – India’s First Woman Scientist to Break Scientific Boundaries

ఆమె కృషి వల్లనే భారతదేశంలో సాంప్రదాయ ఔషధాల పరిశోధన కొత్త పుంతలు తొక్కింది. ఆసిమా ఛటర్జీ దాదాపు 40 సంవత్సరాలు పరిశోధన మరియు బోధనకే అంకితమయ్యారు. ఆమెకు లభించిన అత్యున్నత గౌరవం ఏమిటంటే 1975లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. అలాగే భారత సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఆమె కేవలం ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు ఎందరో భారతీయ మహిళా శాస్త్రవేత్తలకు ఆదర్శం.

ప్రొఫెసర్ ఆసిమా ఛటర్జీ కేవలం రసాయన శాస్త్రాన్ని సుసంపన్నం చేయడమే కాదు, భారతీయ మహిళలు ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని నిరూపించారు. ఆమె పరిశోధన స్ఫూర్తి నేటి యువతకు ఎల్లప్పుడూ ఆదర్శనీయం.

Read more RELATED
Recommended to you

Latest news