ఉద్యోగాల వేటలో విఫలం.. 30వేల పెట్టుబడితో నేడు మంచి వ్యాపారం

-

చదువు అవగానే.. ఉద్యోగం.. వేలల్లో జీతం..సాఫీగా సాగిపోయో జీవితం.. ఇది అంతా చెప్పినంత ఈజీగా ఉండదు.. కొందరికే ఇలాంటి జీవితం దొరుకుతుంది. చదువు అయిపోన వెంటనే.. ప్రతి వ్యక్తి.. ఉద్యోగం కోసం..ఓ యుద్ధమే చేయాలి.. అందులో… సవాళ్లు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, చెప్పులరిగేలా ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది.. ఇదంతా ఓ ఎత్తు అయితే.. ఇంట్లో.. నెలరోజుల్లో ఏదో ఒక జాబ్ సంపాదించి వస్తా అని పల్లె నుంచి పట్నంకు వచ్చిన వారు ఉంటారు. టైం దాటిపోతు ఉంటుంది.. ఇంకా ఏ జాబ్ దొరకదు.. ఏం చేయాలి…తిరిగి ఇంటికి వెళ్తే పెళ్లి చేస్తారు.. ఏ జాబ్ లేకుండా పట్నం మనల్ని ఉంచుకోదు.. ఆ ఖర్చులు పెట్టేలాంటే పైసల్ ఉండాలిగా.. ఇలాంటి పరిస్థితిని దాదాపు ప్రతి అమ్మాయి తన జీవితంలో ఒక స్టేజ్ లో ఫేస్ చేసే ఉంటుంది. చదువాఖరికి వచ్చినప్పుడే పెళ్లి సంబంధాలు చూడటం మొదలేస్తారు.. జాబ్ రాలేదా పెళ్లే అన్నట్లు ఉంటుంది. పాపం ఆ టైంలో ఆ అమ్మాయి పడే ఇబ్బంది మాములుగా ఉండదు..మరి అలాంటి ఉద్యోగాల వేటతో విఫలం అయిన ఓ అమ్మాయి..ఓటమితో వెనుదిరగలా.. వ్యాపారం పెట్టి అందరి ప్రశంశలు పొందుతుంది. ఈమె సక్సస్ ఫుల్ స్టోరీ.. నేడు ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది.. ఇంకెందుకు ఆలస్యం.. స్పూర్తినింపే..ఈ కథ పూర్తిగా చదివేయండి..!
బీహార్లోని పట్నాకు చెందిన 24 ఏళ్ల ప్రియాంక గుప్తా 2019లో ఎకనామిక్స్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకుంది.. రెండేళ్ల పాటు ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు కూడా చేసింది. ‘ఎంబీఏ చాయ్వాలాగా’గా పిలిచే ప్రఫుల్ బిల్లోర్ ని స్ఫూర్తిగా తీసుకుంది. తాను ఎందుకు టీస్టాల్ పెట్టకూడదు అని నిర్ణయించుకుని.. టీ స్టాల్ ఏర్పాటు కోసం బ్యాంకుల చుట్టూ తిరిగిందట.. తనకు ఎవరూ లోన్ ఇవ్వలేదట. స్నేహితులు ముందుకొచ్చి.. వారు రూ. 30 వేలను సాయంగా ఇస్తే… షాప్ ఏర్పాటు చేసిందట.
తల్లిదండ్రుల సహాకారం, స్నేహితుల ప్రోత్సాహం.. ఏప్రిల్ 11న టీ స్టాల్ ప్రారంభం.. రెగ్యులర్‌ టీతో పాటు పాన్‌, మసాలా, చాక్లెట్‌ టీ, బిస్కెట్లు అమ్ముతోందామె. అంతేకాదు అక్కడ బ్యానర్ల మీద స్ఫూర్తినిచ్చే ఎన్నో కొటేషన్లు రాసి ఉంచుతుంది. పీనా హీ పడేగా’ (తాగాల్సిందే), ‘సోచ్ మత్.. చాలూ కర్దే బస్’ (ఆలోచించకు.. మొదలుపెట్టు బాస్) వంటి కొటేషన్స్ తో ఉండే బ్యానర్ను ఏర్పాటు చేసింది. ఈ టీ స్టాల్ లో కప్పు టీ రూ.15 నుంచి రూ.20 వరకు ఉంది.
బయట ఎంతోమంది చాయ్వాలాలు ఉన్నారని.. అలాంటప్పుడు ఒక చాయ్వాలీ ఉండటంతో తప్పేంటి అంటుంది ప్రియాంక. గుప్తా స్టాల్‌లో టీ తాగుతున్న విద్యార్థుల బృందం ఫోటోలు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. నెటిజన్లు ప్రియాంక ప్రయత్నం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ.. ఈ పరిస్థితి రావడం అనేది ప్రభుత్వానికి మంచి విషయం కాదు.. అంత చదువు చదివి.. ఎండలో టీ స్టాల్ నడపాల్సి వచ్చిదంటే.. కారణం.. సరిపడా ఉద్యోగాలు లేకపోవడమేనా అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు.. లైఫ్ లో ప్రతి ఫేస్ ను ఆహ్వానించాలు.. ఏ జాబ్ లేకుండా ఉండేదానికంటే.. సొంతంగా ఏదో ఒక వ్యాపారం చేయడం మంచి విషయమే కదా అంటున్నారు.. ఇంతకీ మీరు ఏంమంటారు..?
 -Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version