9 వ్యాపారాల్లో వరుస నష్టం.. సీన్‌ కట్‌ చేస్తే ఇప్పుడు 1.40 లక్షల కోట్ల కంపెనీకి అధిపతి

-

వ్యాపారం చేయడం అంటేనే కత్తిమీద సాము లాంటిది.. కొంచెం అటు ఇటూ అయినా.. నష్టాల్లో కురుకుపోవాల్సిందే.. మళ్లీ నిలదొక్కుకోవాలంటే ఎంతో కష్టపడాలి.. అలాంటిది ఓ వ్యక్తి వరుసగా 9 వ్యాపారాల్లో నష్టపోయాడు.. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి ఎవరికైనా జీవితం సరిపోదు. మానసికంగా కుంగిపోయి.. డిప్రషన్‌లోకి వెళ్లాడు.. కానీ అలానే ఆగిపోకుండా.. స్క్రాప్ మెటల్ కంపెనీ ప్రారంభించాడు. దాని ప్రస్తుత విలువ 1.40 లక్షల కోట్లు. ఇది మరెవరో కాదు. మైనింగ్ మరియు మెటల్ రంగంలో నేడు దేశంలోనే అతిపెద్ద కంపెనీగా గుర్తింపు పొందిన వేదాంత కంపెనీ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ అనిల్ అగర్వాల్ కథ. కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా నేడు వ్యాపార రంగంలో సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు.

19 ఏళ్ల వయస్సులో, అనిల్ అగర్వాల్ సొంతంగా ఏదైనా చేయాలనే కోరికతో పాట్నాలో తన తండ్రి అల్యూమినియం కండక్టర్ తయారీ వ్యాపారాన్ని వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముంబైకి వచ్చాడు. తన యుక్తవయస్సులో కూడా, అతను 1970 లలో స్క్రాప్ మెటల్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. విజయాన్ని చూడటం ప్రారంభించాడు. కానీ, తన అత్యంత విజయవంతమైన స్టార్టప్‌ను ప్రారంభించే ముందు, అనిల్ అగర్వాల్ అనేక అడ్డంకులను ఎదుర్కొన్నాడు. ‘నేను నా 20 మరియు 30 ఏళ్ళను కష్టపడుతూ గడిపాను. వేదాంత ప్రారంభించడానికి ముందు నేను 9 వ్యాపారాలు చేసి ఫెయిల్ అయ్యాను. కొన్నాళ్లు డిప్రెషన్‌లో ఉన్నాను. ఆ తర్వాతే నా తొలి స్టార్టప్ వ్యాపారం విజయవంతమైంది’ అని అనిల్ అగర్వాల్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విద్యార్థుల ముందు ప్రసంగించారు.

ఆయన ప్రారంభించిన వేదాంత కంపెనీ నేటి మార్కెట్ విలువ 1.4 లక్షల కోట్ల రూపాయలు. అనిల్ అగర్వాల్ కంపెనీ నికర విలువ నేటికి రూ.16700 కోట్లు. 2003లో, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కంపెనీని లిస్ట్ చేసిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. పట్టుదల, కృషి మరియు సంకల్పంతో అడ్డంకులు ఉన్నప్పటికీ మన లక్ష్యాలను సాధించడం ఎంత ముఖ్యమో అనిల్ అగర్వాల్ తన జీవితం ద్వారా చూపించాడు.

దెబ్బ ఎంత గట్టిగా తగిలితే.. అంత బలంగా ఎదుగుతారు అని చెప్పడానికి అనీల్‌ అగర్వాల్‌ కథ ఒక ఉదాహరణ.. ఒక ప్రయత్నం ఫెయిల్‌ అయిందని మనం దేన్ని వదిలిపెట్టకూడదు.. నీ సంకల్పం గట్టిది అయితే.. సాధించే వరకూ శ్రమించడమే మార్గంగా పెట్టుకోవాలి..! అప్పుడే విజయం వెన్నుతడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version