కాంగ్రెస్ లోకి వెళ్లిన 10 మంది బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పదవులు రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. బీఆర్‌ఎస్ రెబల్ ఎమ్మెల్యేలపై హై కోర్టు ఇచ్చిన తీర్పు ను స్వాగతిస్తున్నామని… చారిత్రాత్మక మైన తీర్పు, అధికారపార్టీ కి చెంపపెట్టు అన్నారు. ఫిరాయింపులు చట్ట విరుద్ధం అని కోర్టు పేర్కొందని వివరించారు. పొన్నం ప్రభాకర్ స్వాగతించారు… స్వాగతించడం కాదు అమలు చేయాలని కోరుతున్నానని తెలిపారు.
ఫిరాయింపులను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి, పార్టీ మారిన వారి ఇళ్ల ముందు చావు డబ్బు కొట్టాలని చెప్పిన రేవంత్ రెడ్డీ ఈ రోజు ఎందుకు సమర్తిస్తున్నారని ఆగ్రహించారు. తెలంగాణ లో RR ప్రభుత్వం అధికారం లో ఉందా అని ప్రశ్నించారు. 10 మంది ఎమ్మెల్యేల మీద స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం మరో తప్పు వేసింది… పార్టీ ఫిరాయించిన వ్యక్తి కి PAC చైర్మన్ పదవి ఇచ్చిందన్నారు. ఇది కోర్టు తీర్పును వ్యతిరేకించడమేనని బాంబ్ పేల్చారు. తెలంగాణ కాంగ్రెస్ ఏఐసీసీ లో భాగం కాదా ? తెలంగాణ లో RR కాంగ్రెస్ ఉందా ? అని ఆగ్రహించారు.