96 ఏళ్ల వయసులో నూటికి 98 మార్కులు సాధించిన బామ్మ

-

ఆమె శరీరమే ముసలిదయింది కానీ.. ఆమె కాదు. ఆమె ఆలోచనలు ఇంకా యవ్వనంగానే ఉన్నాయి. 96 ఏళ్ల వయసులో కూడా పట్టుదలను కోల్పోకుండా ఏదైనా సాధించాలనే కసి ఆమెను ఇలా అందరిలో ఒకరిలా కాకుండా సమ్‌థింగ్ స్పెషల్‌గా నిలిపింది. ఆ బామ్మ పేరు కార్తియాని అమ్మ. కేరళలోని అలప్పుజా ఆమె ఊరు. కేరళ ప్రభుత్వం ఇటీవలే ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాని పేరు అక్షర లక్ష్యం. నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించే దిశగా కేరళ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో ఇదీ ఒకటి. అక్షర లక్ష్యం కార్యక్రమంలో ఎవరైనా చేరవచ్చు. చదువురాని వారికి ఈ ప్రోగ్రామ్ ద్వారా చదువు నేర్పిస్తారు. ఏజ్ లిమిట్ కూడా లేదు. దీంతో ఈ బామ్మ తన చదువుకోవాలనే కోరికను ఈ ప్రోగ్రామ్ ద్వారా తీర్చుకోవాలనుకుంది. జాయిన్ అయింది. ఆమెతో పాటు చాలామంది జాయిన్ అయ్యారు. అందరికీ కోర్స్ నేర్పించారు. తర్వాత పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆ బామ్మ కూడా పరీక్షలు రాసింది. ఆమె పేపరు దిద్దిన ప్రోగ్రామ్ నిర్వాహకులు షాకయ్యారు. ఎందుకంటే ఆమెకు ఆ పరీక్షల్లో వందకు 98 మార్కులు వచ్చాయి. దీంతో ఆమెను అంతా తెగ మెచ్చుకున్నారు. వావ్.. బామ్మ.. ఈవయసులో కూడా నూటి 98 తెచ్చుకున్నావంటే.. అప్పట్లో చదువుకొని ఉంటే ఎక్కడో ఉండేదానివని తెగ పొగుడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version