స్ఫూర్తి: కొబ్బరి ఆకులతో స్ట్రాలు.. ఇప్పటికే ఇరవై మిలియన్లు సేల్..!

-

కొంతమంది చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటారు వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా మంచి దారి లో వెళ్ళచ్చు ఈ రోజుల్లో చాలా చోట్ల ప్లాస్టిక్ వస్తువులని బ్యాన్ చేసారు. ప్లాస్టిక్ స్ట్రాలని, కవర్లని వంటివి అమ్మడం లేదు అలాంటప్పుడు చాలా మంది పేపర్ స్ట్రాలు వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. బెంగళూరు బేస్డ్ స్టార్టప్ కంపెనీ సన్ బర్డ్స్ కాలుష్యం లేకుండా ఉండడానికి ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది.

సజీ వర్గీస్ బెంగళూర్ క్రైస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కొబ్బరి ఆకుల తో స్ట్రా లని తయారు చేయాలనే ఆలోచన తో కంపెనీ ని స్టార్ట్ చేసారు. చిన్నగా దీన్ని మొదలు పెట్టి ఏకంగా 20 మిలియన్ల స్ట్రా లని 10 దేశాల లో సేల్ చేయడం స్టార్ట్ చేశారు కొబ్బరి ఆకుల ద్వారా స్ట్రాలను తయారు చేస్తే కాలుష్యం ఉండదని పర్యావరణానికి ఎలాంటి హాని కూడా కలగదని ఈ వినూత్న ఆలోచన తో దీన్ని మొదలు పెట్టారు.

కెమికల్స్ ఏమీ లేకుండా కొబ్బరి ఆకులతోనే మల్టీ లేయర్స్ తో స్ట్రాలని తయారు చేస్తున్నారు ఏదైనా డ్రింక్ ని దీనితో మూడు గంటల సేపు తాగొచ్చు ఒక స్ట్రా ధర వచ్చేసి 5 రూపాయలు. అయితే 20 మిలియన్ల కి పైగా స్టా లని పది దేశాలలో అమ్మినట్లు ఆయన చెప్పారు కేరళ తమిళనాడు కర్ణాటక నుండి వందలాది మంది మహిళలకు ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. మనసుంటే మార్గము ఉంటుందన్న దానికి ఉదాహరణగా నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news