దేశం కోసం ప్రాణాల‌ర్పించిన‌ భ‌ర్త బాట‌లోనే ఆర్మీ ఆఫీస‌ర్ అయ్యింది.. ఈమె జీవితాన్ని చూస్తే శభాష్ అంటారు..!

-

జ్యోతి నైనవాల్ భర్త దీపక్ నైనవాల్ ఆర్మీలో పని చేసేవారు. అయితే 2018 లో జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉగ్రవాదుల మధ్య పోరులో ఆయన మరణించారు. దీపక్ ని చూసి తన భార్య, పిల్లలు ఎంతో గర్వ పడేవారు. తన భర్త జ్ఞాపకాలని గుండెల్లో పెట్టుకుని ఆమె కూడా ఆర్మీ లో చేరింది.

భర్త జ్ఞాపకాలతో కమిలిపోకుండా ఆమె కూడా దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకుంది. ఒంటరిగా అయిపోయానని బాధ లేకుండా తన భర్తను కోల్పోయాను అని కృంగిపోకుండా.. తాను కూడా అదే దారిలో నడిచింది. జ్యోతి ఎకనామిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సివిల్ సర్వీస్ బోర్డు టెస్ట్ కి ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత ఆర్మీలో ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్ క్యాడెట్ లో జాయిన్ అయ్యారు.

తన భర్త చనిపోయాక ఆమె ఆర్మీలోకి వెళ్లారు. టెస్ట్ పాస్ అయిన తర్వాత 11 నెలల పాటు ఆమెకి చెన్నై లో శిక్షణ ఇచ్చారు. 153 క్యాడెట్స్ లో 16 మంది మగవారు, 9 మంది ఆడవారు ఉన్నారు. ఈమె నిజంగా ఒక అగ్నికణం లాగ పైకి లేచారు. భర్త చనిపోయారు అన్న బాధతో ఆమె తన జీవితాన్ని అక్కడితో ఆపేయక అనుకున్నది సాధించారు. నిజంగా ఈమె ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. నిజంగా ఇలాంటి ధీరవనితాలు మనకి కావాలి. ఇలాంటి వాళ్ళు ఉంటే నిజంగా చాలా మంది ఆదర్శంగా తీసుకుని అదే అడుగుజాడల్లో నడుస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version