మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు కునుకు తీయాలని చాలామందికి అనిపిస్తుంది. అయితే అపార మేధావి ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఈ పగటి నిద్ర (Day Sleep) గురించి చాలా స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ అలవాటు మన ఆరోగ్యం, సంపద, మరియు విజయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి చాణక్య నీతిలో మధ్యాహ్నం నిద్రకు ఉన్న అర్థం ఏమిటో చూద్దాం.
చాణక్య నీతి ప్రకారం: ఆరోగ్యంగా ఉన్నవారు పగటి పూట నిద్రపోవడాన్ని చెడు అలవాటుగా పరిగణించారు. ఆయన దీని వెనుక గల నష్టాలను వివరించారు.పని నష్టం, మధ్యాహ్నం నిద్రపోయే వ్యక్తులు ఇతరుల కంటే తక్కువ పని చేస్తారు. దీనివల్ల సమయం వృథా అవుతుంది, పనిలో ఏకాగ్రత దెబ్బతింటుంది మరియు కెరీర్/వ్యాపారంలో ఆదాయ నష్టం కూడా ఎదురయ్యే అవకాశం ఉంది.

ఆరోగ్యం, ఆయుష్షు: చాణక్యుడు మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. అంతేకాదు, పగటి నిద్ర ఆయుష్షును తగ్గిస్తుంది అనే నమ్మకం కూడా ఆయన నీతిలో ఉంది (దీనికి ఆయుర్వేదంలో కూడా కొంతవరకు దగ్గర పోలిక ఉంది). అయితే, గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు మరియు అనారోగ్యంతో ఉన్నవారు మాత్రమే పగటి పూట విశ్రాంతి తీసుకోవచ్చని చాణక్యుడు తెలిపారు.
విజయం రహస్యం, ప్రతి క్షణం సద్వినియోగం: చాణక్యుని దృష్టిలో, విజయానికి మూలం సమయపాలన మరియు క్రమశిక్షణ. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి జీవితంలోని ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పగటి నిద్ర సోమరితనాన్ని పెంచి, శక్తి స్థాయిలను తగ్గిస్తుంది. దీనివల్ల మధ్యాహ్నం తర్వాత పనులపై ఆసక్తి చూపలేరు. ఆధునిక నిపుణులు కూడా 10-15 నిమిషాల పవర్ న్యాప్‌ను అనుమతించినా, గంటల తరబడి నిద్రపోవడం అనేది మీ లక్ష్యాల నుండి దూరం చేస్తుందని చాణక్యుడు స్పష్టం చేశారు.
