నెగెటివ్ ఆలోచనలని కట్టిపెట్టాలంటే ఈ లక్షణాలు మీలో ఉండాలి..

-

నెగెటివ్ ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఏదైనా పనిచేసే ముందు ఈ ఆలోచనలన్నీ చుట్టూ మూగి మిమ్మల్ని ఒక నిర్ణయానికి రాకుండా చేస్తాయి. నెగెటివ్ ఆలోచనలు ఇంకా ఎక్కువైతే మిమ్మల్ని ఏ పని చేయకుండా ఆపేస్తాయి. అందుకే నెగెటివ్ గా ఆలోచించే వాళ్ళు ఏ పనీ మొదలుపెట్టరు. పెట్టినా పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపేస్తారు. మిమ్మల్ని ఎదగనివ్వకుండా ఆపేస్తున్న నెగెటివ్ ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

 

ముఖ్యంగా పక్కవాళ్ళు ఏమనుకుంటారో అన్న విషయాల్ని మర్చిపోవాలి. అలా అనుకున్న ప్రతీసారీ మీరు ముందుకు వెళ్ళలేరు. చాలా మంది చెబుతుంటారు. ఎవరేమన్నా నేను పెద్దగా పట్టించుకోనని. కానీ, అలా చెప్పిన వాళ్ళు కూడా అన్ని విషయాల్లో అలా ఉండలేరు. ఇతరులు ఏమనుకుంటారోనన్న్న అనుమానం వస్తుంటే వారి ఆనందం కోసమే పనిచేయాల్సి వస్తుంది. వారిచ్చే సంతోషాల మీదే మీ జీవితం ఆధారపడాల్సి వస్తుంది. మీ పని వారు బాగుందంటే పొంగిపోతారు. ఇంకా చెప్పాలంటే, వారు బాగుంది అని అనాలన్న ఉద్దేశ్యంతోనే పనులు మొదలెడతారు.

దీనర్థం మీ జీవితంలో సంతోషాలు ఏమీ లేవని, వాటిని నింపడానికి అవతలి వాళ్ళు రావాలని. నీ ఆనంద విషాదాలు నువ్వు చేసే చర్యల వల్ల రావాలి గానీ, అవతలి వాళ్ళు నీ చర్యలకి స్పందించే తీరుని బట్టి కాదు. ఈ ప్రపంచంలో చాలా మందికి ఒక పని పూర్తి చేయడం రాదు. జీరో నుండి మొదలెట్టి పని పూర్తయ్యే వరకు పనిచేయరు. అందుకే పని పూర్తి చేసే వారు చాలా గొప్పవారు. మీ జీవితంలో సంతోషాలు నిండి ఉంటే, అవతలి వాళ్ళు నింపాలని ఆలోచించరు.

అలా ఆలోచించినపుడే మీలోని నెగెటివ్ ఆలోచనలు ఆగిపోతాయి. అప్పుడే మీ జీవితం సరికొత్త దారిలోకి వెళ్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version