ఇన్‌స్టాగ్రామ్‌లో నయా అప్‌డేట్‌….

-

ఈ రోజుల్లో సోషల్‌ మీడియా అనేది లేకుండా యువత కొంచెం సమయం కూడా ఉండలేకపోతున్నారు. రోజురోజుకీ స్మార్ట్‌ఫోన్‌ వినియోగం కూడా సోషల్‌ మీడియా వ్యాప్తిని పెంచింది. మామూలుగా చేసే పనులను కూడా సోషల్‌ మీడియాలో తరుచుగా స్టేటస్‌లుగా పెట్టుకోవడం సర్వసాధారణమైపోయింది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అధిక ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా ఆప్స్. ఈ నేపథ్యంలో ఆ యాప్స్‌ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్‌డేట్స్‌ ఇస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా ప్రముఖ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ షార్ట్‌వీడియోలు చేసే వారికి శుభవార్త చెబుతూ ఇకపై ఆయా వీడియో వద్ద షార్ట్‌ నోట్స్‌ పెట్టేలా కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది.

 

మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో నోట్స్‌ను పోస్ట్ చేసే సామర్థ్యాన్ని పరిచయం చేసింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ పేరు సూచించినట్లుగా వీడియో నోట్‌లు ప్రత్యామ్నాయం కాదని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీడియో నోట్‌లు 2 సెకన్ల వరకు మాత్రమే ఉంటాయి. అయితే, మీరు మీ చిన్న వీడియోలకు క్యాప్షన్స్ జోడించవచ్చు. మరిన్ని మార్గాలను ఇన్ స్టాగ్రం పరిచయం చేసింది. అందులో ఫోటోలు, జీఐఎఫ్‌లు, వీడియోలు, స్టిక్కర్‌లు, ఆడియో సందేశాలు కూడా ఉంటాయి

Read more RELATED
Recommended to you

Exit mobile version