మ‌న మెద‌డుకు సంబంధించిన 10 ఆస‌క్తికర‌మైన విష‌యాలు ఇవే..!

-

మ‌నిషికి మెద‌డు కంప్యూట‌ర్‌లోని హార్డ్ డిస్క్ లాంటిది. ఇంకా చెబితే.. అంత‌క‌న్నా ఎక్కువే. హార్డ్ డిస్క్ కేవ‌లం మెమోరీని మాత్ర‌మే స్టోర్ చేసుకుంటుంది. కానీ మ‌నిషి మెద‌డు అలా కాదు. ఎన్నో భావాల‌కు అది స్పందిస్తుంది. మ‌నిషి ప్ర‌వ‌ర్త‌ను నిర్దేశిస్తుంది. మ‌నిషి తెలివితేట‌ల‌కు కార‌ణ‌మ‌వుతుంది. అయితే చిన్న‌ప్ప‌టి నుంచి చాలా మంది సైన్స్ త‌ర‌గ‌తుల్లో మెద‌డు ప‌నితీరు గురించి తెలుసుకుంటూనే ఉంటారు. కానీ దానికి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను మాత్రం ఇక్క‌డ అంద‌జేస్తున్నాం. వాటిపై ఓ లుక్కేయండి..!

* మ‌నిషి మెద‌డు సుమారుగా 1.36 కిలోల బ‌రువు ఉంటుంది.

* మ‌నిషి మెద‌డులో 60 శాతం కొవ్వు ఉంటుంది. మానవ శ‌రీరంలో అత్యంత ఎక్కువ‌గా కొవ్వు ఉండే అవ‌యవం అదే.

* మ‌నిషి మెద‌డు నుంచి సుమారుగా 23 వాట్ల సామ‌ర్థ్యం ఉన్న విద్యుత్‌ను త‌యారు చేయ‌వ‌చ్చ‌ట‌.

* మ‌న శ‌రీరం ఉత్ప‌త్తి చేసే మొత్తం ర‌క్తం, ఆక్సిజ‌న్‌లో మెద‌డు ఒక్క‌టే 20 శాతం వ‌ర‌కు ఉప‌యోగించుకుంటుంది.

* మెద‌డుకు ర‌క్తం స‌ర‌ఫ‌రా ఆగిపోతే కేవ‌లం 8 నుంచి 10 సెక‌న్ల‌లోనే అప‌స్మార‌క స్థితిలోకి వెళ్తారు.

* మెద‌డుకు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా ఆగిపోయాక 5 నుంచి 6 నిమిషాల వ‌ర‌కు అది ప‌నిచేస్తూనే ఉంటుంది. ఆ త‌రువాత అది నిస్తేజంగా మారుతుంది.

* మెద‌డులో ఉంటే ర‌క్త‌నాళాలు సుమారుగా 1 ల‌క్ష మైళ్ల వ‌ర‌కు పొడ‌వు ఉంటాయి.

* మెద‌డులో 1 ల‌క్ష కోట్ల న్యూరాన్లు ఉంటాయి. ఇవి మెద‌డు నుంచి శ‌రీరంలోని ఇత‌ర అవ‌య‌వాల‌కు స‌మాచారాన్ని పంపిస్తూ, స్వీక‌రిస్తూ ఉంటాయి.

* మ‌హిళ‌లు గ‌ర్భం దాల్చిన స‌మ‌యంలో వారి క‌డుపులో ఉండే పిండంలో నిమిషానికి 2.50 ల‌క్ష‌ల న్యూరాన్లు త‌యార‌వుతాయి.

* వ‌య‌స్సు మీద ప‌డే కొద్దీ స‌హ‌జంగానే ఎవ‌రికైనా మ‌తిమ‌రుపు వ‌స్తుంటుంది. కొంద‌రు కొత్త‌గా నేర్చుకునే విష‌యాల‌ను కూడా గుర్తు పెట్టుకోలేక‌పోతుంటారు. అందుకు కార‌ణం.. మెద‌డులో పాత జ్ఞాప‌కాలు పేరుకుపోవ‌డ‌మే. వాటిని మెద‌డు తొల‌గించ‌లేదు. దీంతో మ‌నం వృద్ధాప్యంలో కొత్త విష‌యాల‌ను స‌రిగ్గా గుర్తు పెట్టుకోలేం.

Read more RELATED
Recommended to you

Exit mobile version