లైఫ్‌ మార్చేసిన లాటరీ టికెట్‌.. చెత్త సేకరించే 11 మంది మహిళలకు తగిలిన రూ. 10 కోట్లు

-

ఉన్నట్టుండి డబ్బులు వస్తే.. ఏంట్రా ఏదైనా లాటరీ తగిలిందా ఏంటి అంటారు. లాటరీ తగిలితే..లైఫే మారిపోతుంది. అప్పటి వరకూ ఎంత పేదరికంలో ఉన్నా.. వచ్చిన డబ్బును బట్టీ మీ లైఫ్‌ యూటర్న్‌ తీసుకుంటుంది. ఇళ్లు, సంస్థల నుంచి బయో డీగ్రేడబుల్‌ వ్యర్థాలను సేకరించి రీ సైక్లింగ్‌ యూనిట్లకు తరలించే పనిచేసే వీరికి లాటరీ తగిలింది. దెబ్బకు కోట్లకు పడగెత్తారు. ఆ 11 మంది మహిళల కళ్లల్లో ఆనందం అంతా ఇంతా కాదు..! చెత్త సేకరించే పని చేసే మాకు ఇంత డబ్బు రావడం పట్టరాని సంతోషాన్ని ఇస్తుందని ఆ మహిళలు అంటున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

మలప్పురం జిల్లాలోని పరప్పన్‌గడి మున్సిపాలిటీలో హరిత కర్మ సేన తరఫున పనిచేసే11 మంది మహిళలు కలిసి రూ.250 పోగుచేసుకొని ఓ లాటరీ టిక్కెట్ కొన్నారు. బుధవారం లాటరీ డిపార్టుమెంటు లాటరీ నిర్వహించగా వీరికి రూ.10 కోట్ల విలువైన మాన‌సూన్ బంపర్ లాటరీ దక్కింది. రూ.10 కోట్ల లాటరీ తగలడంతో ఆ మహిళల ఆనందానికి అంతేలేకుండా పోయింది. తాము జీవితంలో చాలా కష్టాలు పడుతున్నామని, ఈ డబ్బుతో తమ సమస్యలు తీరుతాయని హర్షం వ్యక్తం చేశారు. రాత్రికిరాత్రి లక్షాధికారులైన వీరికి బంధువులు, స్నేహితులు, స్థానికులు శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. చెబుతున్నారు.

ఈ బృందం బంపర్ లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేయడం ఇది నాలుగోసారి. వారు ఇంతకుముందు లాటరీలో రూ.1,000 గెలుచుకున్నారు. ఇళ్లు, సంస్థల నుంచి బయో డీగ్రేడబుల్‌ వ్యర్థాలను సేకరించి రీ సైక్లింగ్‌ యూనిట్లకు తరలించే పనిచేస్తున్న తమకు ఇంతకాలం ఈ ఉద్యోగాలే జీవనాధారంగా ఉన్నాయని ఆ 11మంది మహిళలు తెలిపారు. లాటరీలో వచ్చే డబ్బును సమానంగా పంచుకుంటామని తెలిపారు.

ప్రైజ్‌ మనీలో దాదాపు 35 శాతం ఏజెంట్ల కమీషన్, ట్యాక్స్ లుగా తీసివేయబడుతుంది. మిగతావి ఆ పదకొండు మంది మహిళలు పంచుకుంటారు. ఇలాంటివి చూసినప్పుడు మనకు కూడా అనిపిస్తుంది కదా.. లాటరీ తీసుకుంటే ఒక సారి కాకపోతే ఒకసారి అయినా లక్‌ మన సైడ్‌ ఉంటే ఎంతో కొంత వస్తాయని.! ఆ. ఇవన్నీ వాళ్లకు వీళ్లకు జరుగుతాయి కానీ మన లైఫ్‌లో అస్సలు జరగవు అని ఇంకొంతమంది అనుకుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version