భారీ వర్షాలు … విద్యార్థులకు శుభవార్త … !

-

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు పట్టుకుని వదలడం లేదు. కొంచెం గ్యాప్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ జోరుగా కురుస్తున్నాయి. ఈ వర్షాలు వస్తున్న నేపథ్యంలో ఇంటర్ మీడియట్ బోర్డు కొత్త సంవత్సరానికి తీసుకోవలసిన అడ్మిషన్ ల గడువును పొడిగించినట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ రోజుతో గడువు ముగియాల్సి ఉంది. కానీ వర్షాల కారణంగా పొడిగించిన గడువు ప్రకారం ఆగస్టు 5 వ తేదీ వరకు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ మరియు ప్రయివేట్ ఇంటర్ మీడియట్ కాలేజీలలో ఆగస్టు 5వ తేదీ వరకు అడ్మిషన్ లు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే ఆగస్టు 6వ తర్వాత ఎవరైనా అడ్మిషన్ ల కోసం వస్తే మాత్రం వారు రూ. 500 ల అదనపు రుసుము చెలిచి అడ్మిషన్ ను పొందాల్సి వస్తుంది.

మరి ఈ అవకాశాన్ని విద్యార్థులు నిర్ణీత సమయం లోపు ఉపయోగించుకుంటారని ప్రార్ధన.

Read more RELATED
Recommended to you

Exit mobile version