ఆఫీస్ పాలిటిక్స్ అనేది చాలామంది ఉద్యోగులకు పెద్ద సవాలు. ఇది పని వాతావరణాన్ని దెబ్బతీస్తుంది ఒత్తిడి పెంచుతుంది. కెరియర్ ఎదుగుదలను అడ్డుకుంటుంది ఈ రాజకీయాలు మిమ్మల్ని నిరుత్సాహపరిస్తాయి. కానీ వాటిని ఎదుర్కోవడానికి ఒక శక్తివంతమైన ఆయుధం ఉంది అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ దీని ద్వారా ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం మీ సొంత భావాలను నియంత్రించుకోవడం సాధ్యమవుతుంది. కేవలం మీ పనిలో నైపుణ్యం ఉంటే సరిపోదు ఆఫీస్ పాలిటిక్స్ ని తెలివిగా ఎదుర్కోవడానికి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం వాటిని సమర్థవంతంగా నిర్వహించడం చాలా అవసరం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి ఆఫీస్ పాలిటిక్స్ ను ఎలా అధిగమించవచ్చో తెలుసుకుందాం..
భావాలను అర్థం చేసుకోండి: మొదట మీ భావోద్వేగాలను మీరు అర్థం చేసుకోవాలి. ఆఫీసులో ఎదురయ్యే ఒత్తిడి నిరాశ కోపం వంటి భావాలను గుర్తించి వాటిని ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకోండి ఇది మీ ప్రతిస్పందనను తెలివిగా ఉంచుతుంది.
ఇతరులను అర్థం చేసుకోవడం : ఆఫీసులో పని చేసేటటువంటి ఎంప్లాయిస్ ప్రవర్తన వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారు ఎందుకు అలా వ్యవహరిస్తున్నారో తెలుసుకుంటే వారిని ఎదుర్కోవడానికి సరైన ప్లాన్ రూపొందించవచ్చు.

స్పందించే ముందు ఆలోచించండి : ఆఫీసులో ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకోండి. ఆలోచించి ప్రశాంతంగా తెలివైన నిర్ణయం తీసుకోండి.
బలమైన సంబంధం నిర్మించుకోండి : మీ సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు పెట్టుకోవడం ద్వారా వారి మద్దతుని పొందొచ్చు.ఎక్కువ మంది మన వైపు నిలబడేలా చూసుకోవాలి. ఆఫీస్ పాలిటిక్స్ లో ఇది చాలా ముఖ్యమైనది.
సానుకూలంగా ఉండండి: ఆఫీసులో ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ మీ వైఖరిని సానుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. మీ పనిపై దృష్టి పెట్టండి మీ సామర్థ్యాన్ని నిరూపించుకోండి.
ఆఫీస్ పాలిటిక్స్ ఒక సవాలు అయినా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వాటిని అధికమించవచ్చు మీ భావాలను అర్థం చేసుకోవడం, ఇతరుల భావాలను గౌరవించడం, ప్రతిస్పందించే ముందు కాస్త ఆలోచించడం, బలమైన సంబంధాలను పెంచుకోవడం, సానుకూలంగా ఉండడం ద్వారా మీరు ఈ రాజకీయాల నుంచి దూరంగా ఉండి మీ కెరియర్లో పురోగతి సాధించవచ్చు.
గమనిక: పైన సూచించిన మార్గాలు వ్యక్తిగత అనుభవాల ఆధారంగా మారుతాయి. పరిస్థితులను బట్టి మీ వ్యూహాలను మార్చుకోవడం అవసరం.