9 ఏళ్లకే యాప్, 13 ఏళ్లకు సాఫ్ట్‌వేర్ కంపెనీనే పెట్టాడు..!

-

ఈ పిల్లాడు పిల్లాడు కాదు.. చిచ్చర పిడుగు. కంప్యూటర్ కీబోర్డ్‌ను చేతి వేళ్లతో టకా టకా కొట్టేయగలడు. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలతో ఓ ఆటాడుకుంటాడు. మొత్తంగా చెప్పాలంటే టెక్‌సావీ. అది కూడా 9 ఏళ్లకే. అవును.. 9 ఏళ్లకు కంప్యూటర్ అంటే కూడా ఏంటో తెలియదు నేటి పిల్లలకు. కానీ.. ఈ బుడతడు 9 ఏళ్లకే ఏకంగా ఓ యాప్‌నే క్రియేట్ చేశాడు. ఇక.. 13 ఏళ్లకే సాఫ్ట్‌వేర్ కంపెనీని నెలకొల్పి ఐటీ ఇండస్ట్రీకే సవాల్ విసిరాడు.

ఆ పిల్లాడు ఇండియనే. పేరు ఆదిత్యన్ రాజేశ్. ఊరు కేరళ. తన కుటుంబం తన చిన్నప్పుడే దుబాయ్‌కి వలస పోయింది. ఏదో ఖాళీగా ఉన్నప్పుడు టైమ్ పాస్ చేస్తూ తన తొమ్మిదేళ్ల వయసులో ఏకంగా తన మొదటి మొబైల్ అప్లికేషన్‌ను డెవలప్ చేశాడట. అంతే కాదు.. లోగోలను డిజైన్ చేయడం, వెబ్‌సైట్‌లను డెవలప్ చేయడం కూడా మనోడికి వెన్నతో పెట్టిన విద్య.

రాజేశ్‌కు ఐదేళ్లున్నప్పుడే కంప్యూటర్ అలవాటు అయిందట. అప్పటి నుంచి కంప్యూటర్‌తో కుస్తీ పట్టేవాడట రాజేశ్. ఇప్పుడు ఏకంగా దుబాయ్‌లో ట్రైనెట్ సొల్యూషన్స్ అనే కంపెనీని నెలకొల్పాడు. అది కూడా 13 ఏళ్ల వయసులో.

ఆ కంపెనీ కింద ముగ్గురు ఎంప్లాయిలు ఉన్నారట. వాళ్లు కూడా ఐటీ ఇంజినీర్లు అని అనుకునేరు. ఆదిత్యన్ స్కూల్‌లో చదువుతున్న అతడి ఫ్రెండ్సేనట. నిజానికి ఓ కంపెనీని నెలకొల్పాలంటే కనీసం 18 ఏళ్ల వయసు ఉండాలి. అందుకే.. వీళ్లు ఓ కంపెనీలా వర్క్ చేస్తారు. ఇప్పటి వరకు 12 మంది క్లయింట్స్‌తో వీళ్లు వర్క్ చేశారట. వాళ్లకు ఉచితంగా అప్లికేషన్లు డెవలప్ చేసి ఇచ్చారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version