బ్యాంకు నుంచి రూ.84 లక్షల కాయిన్స్ దొంగలించిన బ్యాంక్ మేనేజర్..!

-

Bank manager steals coins worth Rs 84 lakh to buy lottery tickets in Bengal

అతడు బ్యాంక్ మేనేజర్. జీతం కూడా ఐదు అంకెలు. అయినా దొంగ బుద్ధి పెట్టింది. దీంతో ఏం చేశాడో తెలుసా? బ్యాంకు నుంచి ఏకంగా రూ.84 లక్షల కాయిన్స్ దొంగలించాడు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్‌లోని కోల్‌కతా సమీపంలోని మెమారిలో చోటు చేసుకున్నది. మోమారిలో ఉన్న ఎస్‌బీఐలో పనిచేస్తున్న అసిస్టెంట్ మేనేజర్ తారక్ జైశాల్ ఈ దొంగతానికి పాల్పడ్డాడు. సంవత్సరంనర నుంచి ఆ బ్రాంచ్‌లో పనిచేస్తున్న తారక్.. రోజూ కొన్ని నాణేలను దొంగలించేవాడట. అలా.. నెలకు 50 వేల రూపాయల విలువైన కాయిన్స్ దొంగలించడమే కాకుండా మొత్తం.. 84 లక్షల రూపాయల కాయిన్స్ దొంగలించాడు.

అలా దొంగలించిన కాయిన్స్‌తో లాటరీ టికెట్లు కొనేవాడట తారక్. అలా 84 లక్షలను మొత్తం లాటరీ టికెట్లకే తగలేశాడట. అయితే.. మనోడి బాగోతం మొత్తం వార్షిక ఆడిట్‌లో తెలిసిపోయింది. బ్యాంక్ ఆడిట్‌లో భారీ మొత్తంలో కాయిన్స్ మిస్సయినట్టు గ్రహించిన బ్యాంకు అధికారులు.. తారక్‌పై కన్నేశారు. దీంతో మనోడి బండారం ఎక్కడ బయటపడుతుందోనని బ్యాంకుకు వెళ్లడమే మానేశాడు. దీంతో మనోడే ఆ దొంగతనం చేశాడని కన్ఫర్మ్ చేసుకున్న బ్యాంక్ అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే ఆ కాయిన్స్‌ను దొంగలించినట్టు తారక్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version