కరోనాను జయించిన రోజుల పసికందు… పేరు ఏం పెట్టారంటే…!

-

కరోనా వైరస్ ని జయించిన వారు నిజంగా జీవితంలో ఏదో గొప్పది సాధించినట్టే… ప్రతీ ఒక్కరు కూడా ఇప్పుడు కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే వస్తే ఎలా విజయం సాధించాలి అనే దాని మీద కూడా సిద్దమవుతున్నారు. ఇప్పుడు ఇది రోజుల పసికందు కి కూడా రావడం తో అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలకు ముసలి వాళ్లకు కరోనా సోకుతుంది.

వాళ్లకు కరోనా సోకితే దాదాపుగా మరణమే అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఈ తరుణంలో రోజుల పసికందు కరోనా వైరస్ ని జయించాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో పాప పుట్టిన 9 రోజులకు కరోనా వైరస్ సోకింది. పరిక్షలు నిర్వహించగా పాజిటివ్ అని వచ్చింది. దీనితో ఆమెకు చాలా జాగ్రత్తగా వైద్యం చేసారు. ఎక్కడా కూడా లైట్ తీసుకోకుండా ప్రత్యేక వార్డులో ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందించింది.

పాప తండ్రి మాట్లాడుతూ మా పాప ఏప్రిల్ 7 న సుల్తానియా జనన ఆసుపత్రిలో జన్మించిందని… డ్యూటీలో ఉన్న సిబ్బంది నుంచి నా పాపకు కరోనా సోకిందని ఆయన వివరించారు. పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ అని తేలిందన్నారు. కానీ ఇప్పుడు మా పాప కరోనా నుంచి కోలుకుందని… ఇంటికి చేరుకున్నామని హర్షం వ్యక్తం చేసారు. ఆమెకు ‘ప్రకృతి’ అని నామకరణం చేశామని… ఎందుకంటే మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఆమె విజయం సాధించిందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version