అనారోగ్యంతో బాధపడుతున్న శునకానికి.. మ‌రో శున‌కం ర‌క్తదానం..

-

ఒక మనిషి జీవితాన్ని కాపాడటమంటే మొత్తం మానవాళి నే కాపాడినట్లు అని మన పెద్దలు చెప్పారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మనం చేశే రక్తదానమే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనుషులకు రక్తదానంతో పునర్జన్మ ప్రసాదించడం పరిపాటి. అయితే, అనారోగ్యంతో బాధపడుతున్న ఓ శునకం ప్రాణం నిలబెట్టేందుకు మరో శునకం రక్తాన్ని దానం చేసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో సుందర పట్టణానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి మనీషా కులకర్ణి రెండేళ్లుగా రాట్ వైలర్ జాతి కుక్కకు ‘రానా’ అనే పేరు పెట్టి పెంచుకుంటున్నాడు.

ధార్వాడ్‌కు చెందిన గణేశ్ కూడా ఇదే జాతి శునకాన్ని ‘రోటీ’ పేరుతో పెంచుకుంటున్నాడు. అయితే ఇటీవల కామెర్ల బారిన పడి రోటీ అనారోగ్యం పాలైంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న దానిని కాపాడాలంటే రక్తం అవసరమని వైద్యులు చెప్పడంతో మనీష్ కులకర్ణిని గణేశ్ సంప్రదించి విషయం చెప్పాడు. అతడు అంగీకరించడంతో రానా రక్తదానం చేసింది. దాని రక్తాన్ని రోటీకి ఎక్కించారు. అయితే ఈ విషయం సోషల్ మీడియాకెక్కడంతో ‘రానా’ను పలువురు అభినందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news