అచ్చం ఐరావతం సినిమాలానే.. బొమ్మను ప్రేమిస్తున్న వ్యక్తి..తనతో జీవితం..!

-

రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ఐరావతం మూవీ చూశారా..? అందులో విలన్‌ బొమ్మలనే మనషులుగా భావించి ప్రేమిస్తాడు. సరిగ్గా అలాంటి కథే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది.. అయిన మూవీస్‌లో జరిగినవి రియల్‌ లైఫ్‌లో జరిగితే భలే ఉంటుంది కదా..! సాధారణంగా.. చిన్నపిల్లలు బొమ్మలను ప్రేమిస్తారు.. వాటితోనే ఆడుకుంటారు.. కానీ పెద్దయ్యాక కూడా బొమ్మలనే ప్రేమిస్తే.. ప్రేమ అంటే..మామూలుగా బొమ్మలపైన ఉండే ప్రేమ కాదు.. ఒక అమ్మాయిను ఎంతలా అయితే ఒక అబ్బాయి ప్రేమిస్తాడో.. అచ్చం అలాగే ఆ అబ్బాయి ఆ బొమ్మను ప్రేమిస్తున్నాడట. ఆ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పాడు..

ఆస్ట్రేలియాకి చెందిన అతని పేరు రాడ్. గతేడాది సీజన్‌లో తన తల్లి దగ్గరకు ఓ రియల్ లైఫ్ మహిళ బొమ్మను తీసుకొచ్చాడు. దాన్ని ఇంట్లో అందరికీ పరిచయం చేశాడు. ఇదేంటి.. అంటే.. నా కొత్త ఫ్రెండ్ అంటున్నాడు. ఎలా రియాక్ట్ అవ్వాలో వారికి అర్థం కాలేదు. రాడ్ తెచ్చిన డాల్‌కి కరీనా అని పేరు పెట్టాడు. కానీ ఆ బొమ్మపై కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా రాడ్ తల్లి ఆ బొమ్మను జీర్ణించుకోలేకపోయింది.

ఎవరు ఎన్ని చెప్పినా.. రాడ్ తన మనసు మార్చుకోలేదు. రోజూ ఆ బొమ్మను ఇంట్లో మనిషిలా చూసుకుంటూ ఉండటంతో.. కొన్నాళ్లకు కుటుంబ సభ్యులు కూడా చేసేదేమి లేక అలవాటుపడ్డారు. నిజానికి రాడ్‌కి ఇదివరకే పెళ్లైంది. కొన్ని కారణాలతో భార్యకు విడాకులు కూడా ఇచ్చేశాడు. ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ.. నిజమైన మనిషిని చేసుకోకూడదు అని నిర్ణయించుకొని.. కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉన్నాడు.

ఎన్నాళ్లని ఇలా ఉండాలి.. అనుకుంటూ.. ఆన్‌లైన్‌లో ఆల్టర్నేట్స్ కోసం వెతికాడట.. రియల్ లైఫ్‌లో ఎప్పుడూ అలాంటి బొమ్మను చూడని రాడ్… కరోనా సమయంలో.. సెక్స్ డాల్ ఆస్ట్రేలియా కంపెనీ నుంచి.. ఓ బొమ్మను కొన్నాడు. ఆ బొమ్మ ధర రూ.1.63 లక్షలు. అది కొన్న తర్వాత తన జీవితం మారిపోయిందని రాడ్ చెబుతున్నాడు. అది తన ఒంటరితనాన్ని పోగొట్టిందని అంటున్నాడు.

మొదటి బొమ్మ బాగా నచ్చడంతో.. తాజాగా మరో బొమ్మను డిస్కౌంట్‌పై రూ.1.58 లక్షలకు కొన్నాడు రాడ్. కరీనా పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అకౌంట్ కూడా ప్రారంభించాడు రాడ్. ఆ అకౌంట్‌కి 10వేల మందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. ఈ ప్రేమాయణం నెటిజన్లను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఇదేంటి అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రాడ్ మాత్రం మనుషులకంటే బొమ్మలే మేలు అంటున్నాడు. ఒంటరి జీవితం ఎంత ఇబ్బందిగా ఉంటుందో తనకే తెలుసని అంటున్నాడు. బొమ్మల వల్ల తనకు కొత్త జీవితం వచ్చింది అంటున్నాడు. ఈ ప్రేమాయణం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఇదేంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రాడ్ మాత్రం మనుషులకంటే బొమ్మలే మేలు అంటున్నాడు. ఒంటరి జీవితం ఎంత ఇబ్బందిగా ఉంటుందో తనకే తెలుసని అంటున్నాడు. బొమ్మల వల్ల తనకు కొత్త జీవితం వచ్చింది అంటున్నాడు. లైఫ్‌లో మెంటల్‌ డిస్టబ్‌ అయిన వాళ్లు..ఇలాంటి వాటికి బాగా దగ్గరవుతారు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version