షాకింగ్‌ : ప్రియుడితో పారిపోయేందుకు.. ఎంత పని చేసింది..

-

రోజు రోజుకు పోలీసులన్నా.. కేసులన్నా.. పరిపటిగా మారిపోయింది. అందుకే ఎలాంటి జంకు బొంకు లేకుండా అఘాయిత్యాలకు
పాల్పడుతుననారు. ప్రియుడిపై మోజుతో తనలాగే ఉండే ఓ మహిళ జీవితాన్ని నాశనం చేసింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. 22 ఏళ్ల పాయల్‌ భాటి తండ్రి అప్పుల వేధింపుల వల్ల ఆరు నెలల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తండ్రి మరణానికి సోదరుడు, అతడి భార్య తరుపు కుటుంబం కారణమని ఆమె ఆరోపించింది. వారిని కేసులో ఇరికించంతోపాటు తన ప్రియుడైన అజయ్ ఠాకూర్‌తో పారిపోయేందుకు ఒక ప్లాన్‌ వేసింది. గౌర్ సిటీ మాల్‌లో పని చేసే ఒక మహిళకు తనలాంటి పోలికలు ఉండటంతో ఆమెతో స్నేహం చేసింది. కాగా, నవంబర్‌ 12న పాయల్‌ భాటి ఆ మహిళను తన ఇంటికి తీసుకువచ్చింది. ప్రియుడు అజయ్‌తో కలిసి ఆమెను హత్య చేసింది. ఆమె మృతదేహానికి తన దుస్తులు తొడిగింది.

గుర్తుపట్టకుండా ఉండేందుకు ఆ మహిళ ముఖాన్ని కాల్చివేసింది. ‘నా ముఖం కాలిపోయింది, నాకు జీవించడం ఇష్టం లేదు’ అని సూసైడ్‌ లేఖను పాయల్‌ రాసింది. అనంతరం ప్రియుడు అజయ్‌తో కలిసి పారిపోయింది. అయితే పాయల్‌ ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు భావించిన బంధువులు ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు మాల్‌లో పని చేసే మహిళ అదృశ్యంపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు పాయల్‌ భాటి, అజయ్‌ను అరెస్ట్‌ చేశారు. కాగా, అజయ్‌ను పెళ్లి చేసుకోవాలని పాయల్‌ భావించిందని ఆమె తాత తెలిపాడు. అయితే తన సోదరుడు ఒప్పుకోడన్న భయంతో తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమ్మించేందుకు ఈ దారుణానికి పాల్పడిందని చెప్పాడు.

 

హైదరాబాద్‌కు చెందిన ఓ స్టార్టప్‌ ఇటీవల వార్తల్లో నిలిచిందని, స్కైరూట్ ఏరోస్పేస్‌ సంస్థ త్రీడీ ప్రింటెడ్‌ ఇంజిన్‌తో కూడిన ఓ ప్రవేట్‌ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిందని మంత్రి గుర్తుచేశారు. దేశంలో తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగంగా అది గుర్తింపు పొందిందని చెప్పారు. వివిధ పరిశ్రమలు, పరిశోధన సంస్థల నుంచి వచ్చిన ప్రతినిధులు.. తెలంగాణ ప్రభుత్వాన్ని తమ పారిశ్రామిక భాగస్వామిగా చేసుకోవాలని మంత్రి కోరారు. పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్రంలో మంచి స్పేస్ ఉందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version