అంబటి రాయుడి వల్లే కోహ్లీ, రోహిత్ మధ్య విభేదాలు వచ్చాయా?

-

ఏది ఏమైనా ప్రపంచంలోని మిగితా జట్ల కన్నా బలంగా ఉన్న జట్టు ఆటగాళ్ల మధ్య గ్యాప్ రావడాన్ని క్రికెట్ అభిమాననులు జీర్ణించుకోలేకపోతున్నారు.

టీమిండియాలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా భారత జట్టు ఆటగాళ్ల మధ్య మనస్పర్థలు వచ్చాయని.. ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ శర్మకు పడటం లేదని వార్తలు వస్తున్నాయి. కొందరేమో.. కోహ్లీ భార్య అనుష్క, రోహిత్ భార్య మధ్య విభేదాలు తలెత్తాయని.. అవే ఆటగాళ్ల మధ్య దూరాన్ని పెంచాయని చెబుతున్నారు.

ఏది ఏమైనా ప్రపంచంలోని మిగితా జట్ల కన్నా బలంగా ఉన్న జట్టు ఆటగాళ్ల మధ్య గ్యాప్ రావడాన్ని క్రికెట్ అభిమాననులు జీర్ణించుకోలేకపోతున్నారు.

అయితే.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు రావడానికి ప్రధాన కారణం అంబటి రాయుడేనంటూ వార్తలు వస్తున్నాయి.

మొన్నటి ప్రపంచ కప్ లో కోహ్లీ కన్నా రోహిత్ శర్మే చెలరేగి ఆడిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రపంచ కప్ జరగడానికి ముందు కోహ్లీ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై రోహిత్ వ్యతిరేకత వ్యక్తం చేశాడట. దీంతో వాళ్లిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది.

వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే… అంబటి రాయుడిని సెలెక్ట్ చేయకుండా విజయ్ శంకర్ ను సెలెక్ట్ చేయడంపై రోహిత్ మండిపడ్డాడట. అంబటి రాయుడు ఫామ్ లో ఉన్నాడని.. అంబటిని సెలెక్ట్ చేయాలంటూ కోహ్లీ, రవిశాస్త్రీలకు చెప్పినా వాళ్లు పట్టించుకోలేదట. రోహిత్ అభిప్రాయాన్ని కాదని వాళ్లు రాయుడిని పక్కన పెట్టారు. దాన్ని రోహిత్ జీర్ణించుకోలేకపోయాడట.

ప్రపంచ కప్ ప్రారంభం అయ్యాక కూడా… విజయ్ శంకర్ గాయంతో తప్పుకోవడంతో అప్పుడైనా రాయుడికి అవకాశం ఇవ్వాలని రోహిత్.. కోహ్లీని కోరాడట. అప్పటికీ… రాయుడికి చాన్స్ ఇవ్వకుండా.. మయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేశారు. అలా.. కోహ్లీ, రోహిత్ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయంటూ ప్రచారం సాగుతోంది.

అంతే కాదు.. స్పిన్నర్ చాహల్ విషయంలోనూ వీళ్ల మధ్య గొడవ జరిగిందట. చాహల్ విఫలమవుతున్నా.. అతడిని పక్కన పెట్టి.. షమీ, జడేజాలకు అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదని రోహిత్ అడిగాడట. అయినప్పటికీ.. రోహిత్ అభిప్రాయాన్ని కోహ్లీ పట్టించుకోలేదట.

మరోవైపు ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలోనూ వీళ్ల మధ్య వివాదం తలెత్తిందట. ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ ను ముందుకు తీసుకొస్తే ధోనీ మరిన్ని పరుగులు చేస్తాడని రోహిత్ తన అభిప్రాయం వ్యక్తం చేసినా… ఒకవేళ టాప్ ఆర్డర్ విఫలమైతే… ధోనీ మిడిల్ ఆర్డర్ లో ఆదుకుంటాడని కోహ్లీ చెప్పేవాడట. ఇలా.. వీళ్లిద్దరి మధ్యా అభిప్రాయాలు పొసగక ప్రతి విషయంలోనూ వివాదం తలెత్తిందట.

కోహ్లీ, రవిశాస్త్రి.. తన అభిప్రాయాలకు అస్సలు విలువ ఇవ్వకపోవడంతో రోహిత్ తనకు అనుకూలంగా ఉండే ఆటగాళ్లతో ఓ వర్గంగా చీలిపోవడంతో… మిగితా వారు కోహ్లీ వర్గంగా మారిపోయారట. అలా వాళ్లిద్దరి మధ్య విభేదాలు అలాగే ఉండిపోయాయట.

Read more RELATED
Recommended to you

Exit mobile version