తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన కేసులో తనకు ముందస్తు బెయిల్, FIR నమోదు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్నటువంటి కోర్టు విచారణను డిసెంబర్ 02వ తేదీకి వాయిదా వేసింది.
రాజ్యాంగ విరుద్ధంగా తనపై కేసులు పెడుతున్నారని ఆర్జీవీ తన పిటిషన్ లో వెల్లడించారు. తాను కామెంట్ చేసిన వ్యక్తులు కాకుండా.. సంబంధం లేని వ్యక్తులు తనపై కేసులు పెట్టారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనపై FIR నమోదు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విన్నవించారు. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ పై మూడు జిల్లాలలో కేసులు నమోదు అయ్యాయి. ఆయన కోసం ఒంగోలు, ప్రకాశం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. అయినప్పటికీ ఆర్జీవీ మాత్రం అజ్ఞాతాన్ని వీడటం లేదు.