లగచర్ల కేసులో పట్నం నరేందర్ రెడ్డికి రిమాండ్ పొడగింపు

-

లగచర్ల కేసు లో ఏ1 నిందితుడిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ ను కోర్టు పొడగించింది. నిన్నటితో పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ గడువు ముగిసిపోయింది. అయితే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు కొడంగల్ కోర్టులో హాజరు పరిచారు. దీంతో అతని రిమాండ్ ను డిసెంబర్ 11, 2024 వరకు పొడగిస్తూ జూనియర్ సివిల్ జడ్జీ ఉత్తర్వులను జారీ చేసారు.

Patnam Narendar Reddy

నవంబర్ 11న లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ భూ సేకరణ పై రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ పై లగచర్ల రైతులు, ప్రజలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కొడంగల్ మెజిస్ట్రేట్ లో హాజరు పరిచారు. దాదాపు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version