నులక మంచాల కోసం ఎగబడుతున్న అమెరికన్లు.. ఒక్క మంచం ధర లక్షపైనే..!

-

ఇప్పుడు పట్టుపరుపులు మీద నిద్రపోతున్నారు కానీ.. ఒకప్పుడు చాలా మంది ఇళ్లల్లో నులకమంచాలే ఉండేవి.. వాటిల్లో నల్లులు కూడా.. మీకు గుర్తే ఉండి ఉంటుంది. చిన్నప్పుడు మన ఇళ్లల్లో ఉండే నులక మంచాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లోకి వచ్చేశాయి.. వాటి ధర ఎంతో తెలుసా అక్షరాల లక్ష.. ఓర్ని.. మన ఇంట్లో మూలన పడ్డ ములక మంచం కాస్ట్‌ ఇంత ఉంటుందా..? జనాలకు ఏమైనా పిచ్చా వెర్రా అనుకుంటున్నారా..? హైలెట్‌ ఏంటంటే.. వీటిని కొనెందుకు ప్రజలు ఎగబడతున్నారట..! ఇక్కడ కాదు.. అమెరికాలో…!!

అమెరికాలో మాత్రం నులక మంచాలను కళ్లకు అద్దుకొని మరీ కొనుక్కుంటున్నారు. ఇంకా చెప్పాలంటే… కొందామంటే ఆ మంచాలు లభించట్లేదు. ఎంత డబ్బు పెట్టినా కొరత వల్ల దొరకట్లేదట. విదేశీయులేమో.. మన కల్చర్‌ని ఇష్టపడుతున్నారు. మన దేశంలో పేదవారు కొనుక్కునే నులక మంచం.. అమెరికన్లకు ఇప్పుడు బాగా నచ్చుతోంది. అదే కావాలని.. అడిగి మరీ కొనుక్కుంటున్నారు. ఇండియాలో తయారవుతున్న ఆ మంచాలు.. సముద్రాలు దాటి.. అమెరికాకు వెళ్తున్నాయి. అమెరికా ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో 1 బెడ్ ధర రూ.1 లక్షకు పైగా పెరిగిపోయిందంటే.. ఆ మంచానికి ఎంత క్రేజ్ ఉందో మీరే ఆలోచించండి..దాని కోసం పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. స్టాక్ కొరత ఉంది.

అమెరికన్ ఇ-కామర్స్ వెబ్‌సైట్ Etsyలో భారతీయ సంప్రదాయ బెడ్ (నులక మంచం) ధర రూ.1,12,075గా ఉంది. అమెరికాలో దీని ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రజలు వెంటనే కొనేస్తున్నారు. ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లలో స్టాక్ అయిపోతున్నాయి. కలర్‌ఫుల్ నులక మంచం కావాలనుకుంటే ధర రూ.1.5 లక్షల దాకా ఉంది.

అమెరికన్ ఇ-కామర్స్ వెబ్‌సైట్ Etsyలో రంగురంగుల నులక మంచం ధర ఎక్కువగా ఉంది. ఈ రకం బెడ్లు కొనాలంటే.. రూ.1,44,304 చెల్లించాల్సి ఉంటుంది. ఇది ట్రెడిషనల్ ఇండియన్ బెడ్ పేరుతో ప్లాట్‌ఫారమ్‌లో లభిస్తోంది. సాధారణ రూపాన్ని కలిగి ఉన్న బెడ్ ధర రూ. 1,12,075 లక్షలు. ఈ నులక మంచాలకు బాగా డిమాండ్‌ పెరగడంతో… స్టాక్ వేగంగా అయిపోతోంది. Etsy ప్లాట్‌ఫారమ్‌లో కొన్ని రకాల నులక మంచాలు 4 మాత్రమే మిగిలి ఉన్నాయి. అమెరికాలో నివసిస్తున్న ప్రజలు మన దేశీ స్టైల్ ఉత్పత్తిని పొందేందుకు ఇంతలా ఆసక్తి చూపండి ఆశ్చర్యంగానే ఉంది కదూ..!

ఈ మంచాలు భారతదేశంలోని చిన్న వ్యాపారి నుంచి రవాణా అవుతోందని తెలిసింది. ఆ మంచం చెక్కతో, జనపనార తాడుతో, 36 అంగుళాల వెడల్పుతో అంటే సుమారు 3 అడుగుల పొడవు, 72 అంగుళాలు అంటే 6 అడుగుల పొడవు, 18 అంగుళాలు అంటే 2 అడుగుల ఎత్తుతో తయారవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version