YS Jagan inaugurates YS Raja Reddy Eye Centre in Pulivendula: కంటి పరీక్షలు చేయించుకున్నారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. కడప జిల్లా పులివెందులలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉదయం 9:30 గంటలకు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి ప్రారంభోత్సవ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 12:50 గంటలకు బెంగళూరుకు హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు. కాగా, నిన్న జగన్‌ను కాంట్రాక్టు పనులు చేసిన నాయకులు కలిసి పెండింగ్ బిల్లులపై చర్చించారు.