1950లో ఓ ఐడియా కోల్గెట్ పేస్ట్ దశనే మార్చేసింది..ఆ ఐడియా ఏంటో తెలిస్తే షాక్అవ్వకమానరు..!

-

కొన్ని సార్లు స్మాట్ ఐడియాలే గ్రేట్ గా పనిచేస్తాయి. పెద్ద ప్లాన్ వేసి..స్టెప్ బై స్టెప్ అమలు చేసి చేసిన పనులకంటే..సింపుల్ గా చేసే షార్ప్ పనులే విజయాలను తీసుకొస్తాయి. ఒక చిన్న ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారుగా..అలాగే ఓ యువకుడు ఇచ్చిన ఐడియా కంపెనీ స్థాయినే మార్చేసింది. అదేందో ఇప్పుడు చూడండి.

ఈరోజుల్లో కోల్గేట్ పేస్ట్ తెలియనివారెవరైనా ఉంటారా? మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా అనుకుంటూ గోడలు పగలు కొట్టుకుంటూ వచ్చే యాడ్స్ మీద ఎన్ని ట్రోల్స్ వచ్చాయి అసలు.. 1805లో కోల్గెట్ పేస్ట్ తన మొదటి బ్రాంచ్ ని న్యూయార్క్ లో ప్రారంభించింది. తర్వాత వేరే దేశాల్లో కూడా ఎంతో పాపులర్ అయింది. యుఎస్ మార్కెట్లో లాంచ్ అయిన మొదటి దంత సంరక్షణ సంస్థ కోల్గేట్. అలా ప్రారంభించినప్పటి నుండి దాదాపు 50 సంవత్సరాల వరకు ఏ పోటీ లేకుండా మొదటి స్థానంలో ఉండేది కోల్గేట్.

తర్వాత యూనిలీవర్ ప్రారంభించిన పెప్సోడెంట్ లాంటి కొత్త బ్రాండ్లు వచ్చాక కోల్గేట్ కి మెల్ల మెల్లగా మార్కెట్ విలువ తగ్గడం మొదలైంది. ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నాము… కాబట్టి ఎవరూ తమకు పోటీరాలేరని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండేది కోల్గేట్ సంస్థ. కానీ కొద్ది రోజులకే ప్రతి చోటా ఊహించని స్థాయిలో విమర్శలు రావడం మొదలైంది.

అప్పుడు కోల్గేట్ సంస్థకు ఏం చేయాలో తెలీక సేల్స్ పెంచడానికి ఉపాయాలని వెతకటం మొదలుపెట్టింది. బోర్డ్ మెంబర్స్ అందరితో మీటింగ్ ఏర్పాటు చేశారు. అందరూ తెగ ఆలోచించారు..కానీ ఏ ఒక్కరికీ సరైన ఐడియా రావట్లేదు. ఆ మీటింగ్ లోకి ఒక తక్కువ గ్రేడ్ ఉద్యోగి వచ్చాడు.

ఆ ఉద్యోగి అక్కడి వాళ్ళతో ఒక ఉపాయం ఉంది అని చెప్పాడు. దానికి వాళ్ళు సరే అని చెప్పమన్నారు. అప్పుడు అతను పేస్ట్ బయటికి వచ్చే హోల్ సైజు కొన్ని మిల్లీమీటర్లు పెంచితే సేల్స్ పెరిగే అవకాశం ఉంది అని చెప్పాడు. ఎందుకంటే ఒకవేళ పేస్ట్ వచ్చే హోల్ సైజు పెద్దగా ఉంటే బ్రష్ మీద పేస్ట్ ఎక్కువగా పడుతుంది. దాంతో పేస్టు తొందరగా అయిపోతుంది. అప్పుడు జనాలు వెంటనే మళ్లీ పేస్టుని కొనుక్కుంటారు. అలా ఎక్కువసార్లు కొనడం వల్ల సేల్స్ పెరుగుతాయి అని చెప్పాడు. వినటానికి చాలా సిల్లీగా ఉంది కదా..

ఆ ఐడియా విన్న బోర్డు మెంబర్లు అందరూ అతన్ని చూసి నవ్వారు. ఆ ఆలోచన చాలా తెలివి తక్కువగా ఉంది అని వెటకారం చేశారు. తర్వాత ఎన్నో ఐడియాలు అమలు చేశారు కానీ ఒక్కటి కూడా మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో కంపెనీ ఆర్థిక పరిస్థితి ఇంకా కుదేలయింది.

అప్పుడు సడన్ గా అందరికీ అతను చెప్పిన ఉపాయం గుర్తొచ్చింది. ఎలాగూ పరిస్థితి అస్సలు బాగాలేదు కాబట్టి ఈ ఐడియా వర్కౌట్ అయినా కాకపోయినా పెద్దగా తేడా ఏం ఉండదులే అనుకున్నారు. దాంతో ఆ ఉద్యోగి ని పిలిచి తను చెప్పిన ఐడియాని ఇప్పుడు అమలు చేస్తున్నట్టు అతనికి చెప్పారు.

అతను చెప్పినట్టే పేస్ట్ బయటికి వచ్చే హోల్ ని కొంచెం పెంచారు. దీంతో మెల్లగా మార్కెట్లో కోల్గేట్ అమ్మకాలు మళ్లీ పెరగడం మొదలయ్యాయి. ఆర్థిక పరిస్థితి కోలుకుంది. దాంతో మళ్ళీ కోల్గేట్ తన మునుపటి స్థానానికి వచ్చేసింది. ఈ ఐడియా ఇచ్చినందుకు ఆ ఉద్యోగిని సత్కరించడమే కాకుండా కంపెనీని తిరిగి ఎంతో పెద్ద స్థాయికి తీసుకు వచ్చినందుకు అతని పేరుని ఎన్నో బిజినెస్ పుస్తకాల్లో ప్రచురించాట.

ఇంత చిన్న ఐడియా కోల్గేట్ దశ నే మార్చేసింది. అందుకే కొన్నిసార్లు కష్టపడి ఆలోచించడం కంటే తెలివిగా ఆలోచించటం మేలంటారు.

– Triveni Baskarowthu 

Read more RELATED
Recommended to you

Exit mobile version