ఏపీలో జిల్లాల వారీగా ఓటింగ్ శాతం … ఏ జిల్లాలో ఎక్కువ.. ఏ జిల్లాలో తక్కువ..!

-

పోలింగ్ సరళిని తీసుకుంటే.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఓటింగ్ శాతం అంతగా పెరగలేదు. కానీ.. మధ్యాహ్నం 3 గంటల నుంచి మాత్రం పోలింగ్ శాతం విపరీతంగా పెరిగింది.

ఇది నిజంగా రికార్డు స్థాయి పోలింగే. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఏపీలో ఓటరు భారీ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు కూడా ఓటింగ్ కోసం వెళ్లడం గమనార్హం. దీంతో ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో 76.69 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. పోలింగ్ అత్యధికంగా నమోదైన జిల్లా విజయనగరం. అక్కడ 85 శాతం పోలింగ్ నమోదయింది. అత్యల్పంగా అంటే విశాఖపట్టణం, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నమోదైంది. ఆయా జిల్లాల్లో 70 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది.

ఇక.. పోలింగ్ సరళిని తీసుకుంటే.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఓటింగ్ శాతం అంతగా పెరగలేదు. కానీ.. మధ్యాహ్నం 3 గంటల నుంచి మాత్రం పోలింగ్ శాతం విపరీతంగా పెరిగింది. 3 నుంచి 6 వరకే పోలింగ్ శాతం పెరిగినట్లు ఈసీ వెల్లడించింది.

ఈవీఎంలు మొరాయించినా అధికంగా పోలింగ్ శాతం

అయితే.. ఏపీ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం, మరికొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం లాంటివి మనం చూశాం. ప్రధాన పార్టీల కార్యకర్తలు పోలింగ్ బూత్‌ల వద్దే ఘర్షణకు దిగడం, నరుక్కోవడం చేసుకున్నారు. ఇద్దరు ముగ్గరు ప్రాణాలు కూడా కోల్పోయారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించి ఓటర్లు ఓటు వేయకుండానే వెనుదిరిగారు. అయినప్పటికీ.. పోలింగ్ శాతం మీద ఇవేమీ ప్రభావం చూపించలేదు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరిగింది. గతంలో జరిగిన ఎన్నికలను పరిగణనలోకి తీసుకుంటే ఈసారి పోలింగ్ పెరిగిందని ఈసీ చెబుతోంది. మరి.. పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం. ఎవరికి ఏపీ ప్రజలు పట్టం కట్టారు? ప్రభుత్వ పథకాలే వాళ్లను పోలింగ్ బూత్‌కు లాక్కొచ్చాయా? లేక ప్రభుత్వ వ్యతిరేకతా? అనేది తెలియాలంటే మే 23 కోసం వెయిట చేయాల్సిందే.

జిల్లాల వారీగా ఓటింగ్ శాతం కోసం కింది పట్టికను చూడొచ్చు..

Read more RELATED
Recommended to you

Exit mobile version