బొద్దింకలు ఎక్కువైపోయాయా..? ఇలా చేయండి మరి..!

-

ప్రతి ఒక్కరు కూడా ఇంటిని అందంగా ఉంచుకోవాలని శుభ్రంగా ఉంచుకోవాలని చూస్తూ ఉంటారు. ఇంట్లో బొద్దింకలు వంటివి ఉండడం వలన చూడటానికి బాగోదు సరి కదా వాటి వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. ఆహార పదార్థాలను ఎక్కడపడితే అక్కడ పడేస్తే బొద్దింకలు కచ్చితంగా ఇంట్లో ఎక్కువ అవుతాయి. ఎప్పుడూ కూడా తినేసిన తర్వాత కవర్లని ఆహార పదార్థాలు ఏమీ లేకుండా చూసుకోవాలి.

 

ఇంట్లో సూర్యరశ్మి ఉండేలా చూసుకోవాలి. వేడి వెల్తురు ఉంటే బొద్దింకలు రావు. ఇంటికి సూర్యకాంతి వచ్చేలా తలుపులు తెరిచి ఉంచుకోవాలి. నీటి శాతాన్ని తగ్గించండి. ఏడు రోజుల కంటే ఎక్కువ నీరు లేకుండా బొద్దింకలు ఉండలేవు. బొద్దింకలు ధూపం వేస్తే పోతాయి అలానే బొద్దింకలను వదిలించుకోవడానికి మార్కెట్లో దొరికే బొద్దింకల స్ప్రే ని కూడా ఉపయోగించవచ్చు ఇంటి లోపల బాగాని వీలైనంత వరకు క్లీన్ గా ఉంచుకోండి.

అప్పుడు ఇంట్లోకి చేరవు. పెప్పెర్మింట్ ఆయిల్ ని స్ప్రే చేస్తే బొద్దింకలు మీ ఇంట్లో నుండి వెళ్లిపోతాయి. పెప్పర్మెంట్ ఆయిల్ బొద్దింకల ని దూరం చేయడానికి చాలా చక్కగా పనిచేస్తుంది. బిర్యాని ఆకుల్ని కూడా మీరు ఇంట్లో పెట్టండి. బిర్యానీ ఆకుల్ని ఇంట్లో పెట్టడం వలన బొద్దింకలు ఇంట్లో నుండి ఆ ఘాటుకి వెళ్ళిపోతాయి. మిరియాలు, వెల్లుల్లి, ఉల్లి కూడా బొద్దింకలని దూరం చేయగలదు. ఇలా వీటన్నిటితో మీరు ఈజీగా బొద్దింకల నుండి దూరంగా ఉండొచ్చు. బొద్దింకలు ఇంట్లో ఉన్నట్లయితే అనేక సమస్యలు కలుగుతుంటాయి కాబట్టి వీలైనంత వరకు వాటిని వదిలించుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news