వైఫై అతిగా వాడేస్తున్నారా..? ఈ సమస్యలు తప్పవుగా..!

-

ఈరోజుల్లో వైఫై వాడని వాళ్లు అంటూ ఉండరేమో అని చెప్పడంలో సందేహం లేదు.. పనులు చేసుకునేవాళ్లు తప్పించి.. చదువుకునేవాళ్ల నుంచి ఉద్యోగాలు చేసే వాళ్ల వరకూ అందరూ ఫోన్లు, వైఫైలు వాడేస్తుంటారు.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసేవాళ్లు అయితే వైఫైతోనే పనిచేస్తారు.. Wi-Fi, మొబైల్‌ని నిరంతరం ఉపయోగించడం, వాటి పరిధిలో ఎక్కువ సమయం ఉండటం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది.

వైఫై ఎక్కువగా వాడటం వల్ల కలిగే నష్టాలు..

గంటల తరబడి కంప్యూటర్‌, మొబైల్‌లో ఇంటర్నెట్‌ వినియోగించడం ద్వారా ఆటోమేటిక్‌గా శారీరక శ్రమ తగ్గిపోతుంది. దీని వల్ల ఊబకాయం సమస్య కూడా పెరిగిపోతుంది.. Wi-Fi వేవ్స్‌ మానసికంగా ప్రభావితం చేస్తాయట.. ఇంటర్నెట్‌ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల చిరాకు వస్తుంది. ప్రతి చిన్న విషయానికి అసహనం వ్యక్తం చేస్తుంటారు.
Wi-Fi తరంగాలు ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగించడం నిద్రను బాగా ప్రభావితం చేస్తుంది. ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగించే వారిలో నిద్రలేమి సమస్య కనిపిస్తోంది. మొబైల్స్, ల్యాప్‌టాప్‌లను ఎక్కవ సేపు ఉపయోగిస్తే కంటి చూపుపై ప్రభావం కనిపిస్తుంది. ఎక్కవ సేపు మొబైల్‌ లేదా ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌ చూడటం వల్ల కళ్లలో మంటలు వస్తాయి. కొన్నిసార్లు కంటి వాపు సమస్య కూడా ఎదురవుతుంది.
ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల జ్ఞాపకశక్తిపై చెడు ప్రభావం కనిపిస్తోందట… దీనివల్ల త్వరగా అల్జీమర్స్ సమస్యలు వస్తున్నాయి. చాలా మంది విషయాలను గుర్తుపెట్టుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంతెందుకు..మన నానమ్మలకు మన వయసులో ఉన్నంత జ్ఞాపకశక్తి మనకు ఇప్పుడు ఉండటం లేదు..

ఇవి చేస్తే మేలు..

రాత్రి నిద్రపోతున్నప్పుడు wi-fiని ఆఫ్ చేయాలి.
నిద్ర పోయే ముందు మొబైల్‌ వినియోగించకూడదు.
రోజులో ఎక్కువగా శారీరక శ్రమ చేయడానికి ప్రయత్నించాలి.
పోషకాహారం తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
ఫాస్ట్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండటం మేలు.
వైఫై ఉండే ఇళ్లల్లో వైఫై స్విచ్చ్‌ ఎప్పుడూ ఆన్‌లోనే ఉంచుకుంటారు.. రాత్రి నిద్రపోయే ముందు కూడా అలానే వదిలేస్తారు.. ఇలా చేయడం వల్ల కంటికి కనిపించని తరంగాలు..ఎన్నో సమస్యలను తెచ్చిపెడతాయి.. మార్నింగ్‌ ఎలాగూ ఆపలేం..కనీసం రాత్రుళ్లు అయినా వైఫై ఆపేసి నిద్రపోవడం ఉత్తమం..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version