WaltairVeerayya : నేడు “వాల్తేరు వీరయ్య” విజయోత్సవ సభ..గెస్ట్ గా రాంచరణ్

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య’ సినిమా 13 తేదీన థియేటర్స్ లో విడుదల అయ్యి సంచలన వసూళ్ళు రాబడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర లో నటించారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.ఈ సినిమా తో చిరంజీవి వింటేజ్ లుక్ తో అదరగొట్టాడు మాస్ ఎలివేషన్స్, కామెడీ, యాక్షన్, డైలాగ్స్, సాంగ్స్ అదిరిపోయాయి.


ఇప్పటికే కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది.తాజాగా 10 రోజులకు 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది.ఈ చిత్రం ఇప్పటికే యూ ఎస్ బాక్సాఫీస్ వద్ద 2.3 మిలియన్ డాలర్ల పైగా వసూళ్లు సాధించి రికార్డ్ బ్రేక్ వసూళ్ళు సాధిస్తోంది. దీనితో యుఎస్ఏ లో తన గత సైరా నరసింహ రెడ్డి హయ్యెస్ట్ వసూళ్ల ను కూడా బ్రేక్ చేసింది. ఇక సంక్రాంతి పండుగకు వచ్చిన అన్ని సినిమాలను క్రాస్ చేసి నంబర్ వన్ గా నిలబడింది. దీనితో ఈ సినిమా సక్సెస్ మీట్ హనుమకొండ లో ఏర్పాటు ఫిక్స్ చేశారు. ఇవాళ హనుమకొండ లో జరగబోతోంది. ఇక ఈ గ్రాండ్ ఈవెంట్ కి గాను రామ్ చరణ్ కూడా వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version