మీ పిల్లలు కూడా బాగా అల్లరి చేస్తున్నారా..? అల్లరి తగ్గాలంటే ఇలా చేయండి..!

-

మీ పిల్లలు అల్లరి ఎక్కువగా చేస్తూ ఉంటారా..? మీ పిల్లల అల్లరిని తగ్గించాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి ఇలా చేస్తే మీ పిల్లలు అల్లరి కంట్రోల్ అవుతుంది. చిన్నప్పటి నుంచి పిల్లలకి మంచి, చెడు చెప్పాలి. వాళ్లకు క్రమశిక్షణ అలవాటు చేయాలి. అప్పుడు పిల్లలు అల్లరి తగ్గించుకుంటారు. అలాగే పిల్లలు అల్లరి చేయకుండా ఉండాలంటే వారు చేసే ప్రతి తప్పుని తప్పు అని చెప్పాలి. కొన్నిసార్లు పిల్లలు మాట వినకుండా ఉంటారు. ఏం చెప్పినా అసలు వినరు. వద్దన్న పని కూడా చేస్తూ ఉంటారు. కోపం తీసుకువస్తూ ఉంటారు.

అందరితో గాయాలు కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టి దారిలో పెట్టొచ్చు అని అనుకుంటారు. కానీ కొట్టడం కంటే వారికి ప్రేమగా చెప్పడం మంచిది. అలా చేయడం వలన పిల్లలు మారతారని సైకాలజిస్ట్లు చెప్తున్నారు. పిల్లలు మీద తల్లిదండ్రులు ఎక్కువగా అరుస్తూ చెప్పినట్లయితే వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కూర్చో పెట్టి ఆ పని ఎందుకు వద్దు అనే దాని గురించి చెప్పాలి.

అంతే కానీ వాళ్ళ మీద అరవడం, కోప్పడడం, కొట్టడం వంటివి చేయకూడదు. ఒకసారి మీరు మీ పిల్లలకి చెప్పాక వాళ్ళు మీ మాట విన్నారా లేదా అనేది గమనించాలి. వారు వినకపోతే మళ్ళీ ప్రేమగా చెప్పాలి. పేరెంట్స్ పిల్లలపై కోపం చూపించడం వల్ల ఏమవుతుంది అంటే మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్లడానికి ముందు అక్కడ ఎలా ఉండాలని కూడా వారికి చెప్పాలి. ఇలా పిల్లలు అల్లరిని తగ్గించొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news