జగన్ పాలనలో దోపిడీ, కబ్జాల పై కవితలు చదివి వినిపించారు మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్ది. 104, 108 అంబులెన్సు సర్వీసెస్ ను జీవికే నుండి తీసుకున్న అరబిందో భారీ దోపిడీకి పాల్పడింది అని ఆయన ఆరోపించారు. అలాగే జీవికే సంస్థకు ఇస్తున్న డబ్బు కేట్ డబుల్ చేసి దోపిడీ చేశారు. విజిలెన్స్ నివేదికలో 104 సర్వీసెస్ లోనే రూ.175 కోట్లు అధికంగా వసూలు చేసినట్టు తేలింది అని ఆయన స్పష్టం చేసారు.
అలాగే ట్రస్ట్ కార్యకలాపాల పేరుతో వ్యాపార తరహా వసూలుకు అరవిందో సంస్థ పాల్పడింది. 108, 104 సేవలు అందించడంలో వైఫల్యం చెందటంతో పాటు.. నిధులను దోపిడీ చేశారు. గోల్డెన్ అవర్ పాటించడంలో కూడా అరవిందో సంస్థ విఫలమైంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వారికి మరణ శిక్ష పడాలి. ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు చండశాసనులు లాగా వ్యవహరించాలి అని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు.