పెళ్లి తాంబూలం ఇవ్వలేదని గ్రామ బహిష్కరణ

-

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతోందని అట్టహాసంగా వేడుకలు నిర్వహించుకున్నాం. కానీ కొన్ని వర్గాలు మాత్రం ఇంకా అణిచివేతకు గురవుతూనే ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో అణగారిన వర్గాల వారిని సామాజిక జాఢ్యాలు పట్టి పీడుస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటన ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకాలోని హరవాడ అనే గ్రామంలో చోటుచేసుకుంది.

అసలేమైందంటే.. హరవాడ గ్రామానికి చెందిన బంట వెంకు గౌడ 10 సంవత్సరాల క్రితం తన కుమారుడికి వివాహం చేశాడు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన కులపెద్ద ఆనంద సిద్ద గౌడకు.. తాంబూలం ఇవ్వలేదు. దీంతో అసహనానికి గురైన ఆనంద సిద్ద గౌడ.. కులస్థులను పిలిచి వెంకు గౌడ కుటుంబాన్ని సంఘ బహిష్కరణ చేయించాడు. బహిష్కరించిన వారికి ఎలాంటి సహయం చేయకూడదని.. నీళ్లు, నిత్యావసరాలు లాంటివి కూడా అందించరాదని ఆంక్షలు విధించారు. అప్పటి నుంచి గ్రామానికి చెందినవారెవరూ.. వెంకు గౌడ కుటుంబంతో మాట్లాడటం లేదు.

ఆనంద సిద్ద గౌడ, బంట వెంకు గౌడ కుటుంబాలు గతంలో ఉమ్మడి కుటుంబంగా ఉండేవి. రోజులు గడుస్తున్న కొద్దీ చిన్న చిన్న గొడవలు.. ఆస్తి సమస్య వరకు చేరి పెద్ద ఎత్తున గొడవకు దారితీశాయి. ఉమ్మడి కుటుంబంగా ఉన్న ఆనందగౌడ కుటుంబం విడిపోయింది. కుల పెద్దకు తాంబూలం ఇవ్వలేదనే కారణంతో తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. ఇలాంటి పరిస్థితి ఇంకెవరికీ రాకుడదని వెంకు గౌడ భార్య కన్నీళ్లు పెట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version