ప్రతి ఒక్కరి జీవితంలో మరణం అనేది సహజమే. ఎవరైనా మరణించిన తర్వాత ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా అన్ని ముగిసిపోతాయి. అయితే మరణించక ముందు శరీరంలోని అన్ని అవయవాలు పనిచేస్తాయి. అదే విధంగా మరణంతో అవయవాల పనితీరు కూడా ఆగిపోతుంది అని అందరికి తెలిసిందే. కానీ కొన్ని అవయవాలు మాత్రం మనిషి చనిపోయిన తర్వాత కూడా సజీవంగానే ఉంటాయి. మనుషులు చనిపోయిన తర్వాత వారి శరీరం బిగిసిపోతుంది, కండరాలు కొంచెం కుచించుకుపోతాయి. మరణించిన తర్వాత మెదడు నుండి ఎటువంటి ఆదేశాలు శరీర అవయవాలకు రాకపోయినా వాటి పనితీరు కొనసాగుతుంది.
అంతేకాక శరీరంలోని కొన్ని జాయింట్లు, కండరాలు కదలగలవు. చనిపోయిన తర్వాత కూడా ఇటువంటి కదలికలను చూస్తే ఇంకా బతికే ఉన్నారని భావిస్తారు. మనిషి మరణించాకా ఆ వ్యక్తి చర్మ కణాలు కూడా బతికే ఉంటాయి. సహజంగా చర్మ కణాలు సజీవంగా ఉండాలంటే ఆక్సిజన్ అవసరం. కాకపోతే శరీరం నుండి ఆక్సిజన్ అందకపోయినా సరే చర్మ కణాలు బ్రతికే ఉంటాయి, ఇవి బయట నుండి గాలి తీసుకొని సజీవంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ విధంగా చర్మం ఎక్కువ రోజులు పాటు జీవిస్తుంది. మరణించిన తర్వాత జరిగే దహనం వలన మరియు బ్యాక్టీరియా వలన శరీరం మట్టిలో క్రమంగా కలిసిపోతుంది. సహజంగా మనిషి చనిపోయిన తర్వాత గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది కాకపోతే కొన్ని నిమిషాలు పాటు మెదడు పని చేస్తుంది. ఆ సమయాన్ని గోల్డెన్ అవర్ అని అంటారు. అటువంటి సందర్భాలలో హాస్పటల్ లో చేర్చినా లేదా సిపిఆర్ వంటి ప్రక్రియలు చేసినా గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. ఈ విధంగా మనిషి చనిపోయిన తర్వాత కొన్ని అవయవాలు కొంత సమయం పాటు పని చేస్తూనే ఉంటాయి.