ఫంక్షన్ హాల్ బంపర్ ఆఫర్.. రెండో పెళ్లికి 50%.. మూడో పెళ్లికి 75%.. ఎక్క‌డో తెలుసా..?

-

ఓ ఫంక్ష‌న్ హాల్ బంప‌ర్ ఆప‌ర్ ప్ర‌క‌టించింది. రెండో పెళ్లికి 50%.. మూడో పెళ్లికి 75% రాయితీల‌ను అందిస్తోంది. అదేంటి అనుకుంటున్నారా..? అది తెలియాలంటే ఈ వివ‌రాలు చూడాల్సిందే. పాకిస్థాన్‌లోని బహావల్‌పూర్‌కు చెందిన ఓ ఫంక్షన్ హాల్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకునే సామర్థ్యం కలిగి ఉన్న మగవాళ్లకు తమ ఫంక్షన్ హాల్‌లో రాయితీలను కల్పిస్తున్నట్టు ఆ ఫంక్షన్ హాల్ యజమాని ప్రకటించాడు. రెండో పెళ్లి చేసుకునే వ్యక్తికి 50 శాతం రాయితీ, మూడో పెళ్లి చేసుకునే వ్యక్తికి 75 శాతం రాయితీ, నాలుగో పెళ్లి చేసుకునే వారికి ఉచితంగా వలీమా ఇస్తున్నట్టు ప్రకటించారు.

పాకిస్థాన్‌కు చెందిన ఓ న్యూస్ చానల్‌లో ఈ ప్రకటనకు సంబంధించిన ఓ వీడియో టెలికాస్ట్ అయింది. అప్పటి నుంచి ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ఆఫర్‌కు కొన్ని షరతులు కూడా ఉన్నాయి. భర్త రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే.. మొదటి భార్య మాత్రమే ఫంక్షన్ హాల్‌ను బుక్ చేయాల్సి ఉంటుంది. భార్య కాకుండా మరెవరు బుక్ చేసినా.. రాయితీ అమలు అవ్వదంటూ ఫంక్షన్ హాల్ యజమాని చెప్పుకొచ్చాడు. కాగా.. ముస్లిం కుటుంబాలలో భర్త ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడం సహజం.

Read more RELATED
Recommended to you

Exit mobile version