ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ వైఫై..!

-

సూపర్ కదా. మనకు తిండి లేకున్నా ఏం లేదు కానీ.. వైఫై ఉంటే చాలు. అది కూడా ఫ్రీ వైఫై అంటే లొట్టలేసుకుంటూ కనెక్ట్ చేసుకుంటాం. అందుకే చైనాకు చెందిన లింక్ స్యూర్ అనే కంపెనీ.. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతోంది. కాకపోతే 2026 వరకు ప్రపంచమంతా ఫ్రీ వైఫైని అందిస్తుందట. కాస్త టైమ్ పట్టినా ఇది మాత్రం పక్కా అంటోంది కంపెనీ.

దాని కోసం మొత్తం 272 శాటిలైట్లను స్పేస్ లోకి పంపించనున్నారు. ఆ కంపెనీ ఇప్పటికే ఓ శాటిలైట్ ను రోదసీలోకి పంపించింది. దీనికోసం దాదాపు 3 వేల కోట్ల రూపాయలను కంపెనీ ఖర్చుపెట్టనుందట. 2020 వరకు మరో 10 శాటిలైట్లను స్పేస్ లోకి పంపిస్తారట. మొత్తానికి 2026 కల్లా 272 శాటిలైట్లను రోదసీలోకి పంపించి ఫ్రీ వైఫై కి నాంది పలుకుతామని కంపెనీ స్పష్టం చేసింది.

ఇప్పటికే.. గూగుల్, స్పేస్ ఎక్స్, వన్ వెబ్, టెలిసాట్ అనే కంపెను ఉచిత ఇంటర్నెట్ ఇవ్వడం కోసం తమ శాటిలైట్లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. 2017 కల్లా ప్రపంచవ్యాప్తంగా 3.9 బిలియన్ మంది ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నారట. అంటే 390 కోట్ల మంది అన్నమాట. ప్రపంచ జనాబాలో సగానికి పైనే ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. దీని ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొనే ప్రపంచవ్యాప్తంగా ఏ మూలకు వెళ్లిన ఇంటర్నెట్ వచ్చేలా.. అది కూడా ఉచితంగా ఇచ్చేలా ముందడుగేసింది లింక్ స్యూర్ కంపెనీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version