ఇల్లందు: గాలి గాల్లకు ఓటెయ్యకండి.. కేసీఆర్

-


ఎన్నికలు వచ్చినప్పుడల్లా..నాయకులొస్తారు..ఓట్లు అడుగుతారు..అలా అని గాలి గాల్లకు ఓటు వెయ్యకండి అంటూ కేసీఆర్ కోరారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు లో నిర్వహించిన బహిరంగ సభలో తెరాస అధినేత కేసీఆర్ మాట్లాడుతూ… ఓటు వేసేముందు కాస్త ఆలోచించండి. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు..ఓ వైపు 50 ఏళ్లకు పైగా పాలన అందించిన కాంగ్రెస్, తెదేపాలు… మరో వైపు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో తెరాస నాలుగున్నరేళ్ల పాలన ఏ పార్టీ మీకు మంచి చేసిందో..చేస్తుందో తెలుసుకుని ఓటు వేయండి అన్నారు. గత పాలకులు తెలంగాణలో చిమ్మ చీకట్లు అలముకుంటాయన్నారు. కానీ ఇప్పుడు మన దగ్గర తయారు చేసిన కరెంటుని పక్కరాష్ట్రాలకు అమ్ముతున్నామన్నారు. గత పాలకుల కుట్రవల్లనే ఉమ్మడి ఖమ్మం జిల్లా భారీ దోపిడికి గురైందన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది లోపే పోడు భూములకు పరిష్కారం చూపిస్తామన్నారు. భవిష్యత్‍ లో ఇల్లందులో అండర్ గ్రౌండ్ మైన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.

స్థానిక కాంగ్రెస్ నేతల చేతగాని తనం వల్ల ఇప్పటికీ రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ పేర్లతోనే అన్ని ప్రాజెక్టులున్నాయన్నారు. ప్రాజెక్టులు రీడిజైనింగ్ చేసి తెలంగాణకు నీళ్లు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తుంటే నేడు రాహుల్ గాంధీ తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రుద్రమ కోటకు వస్తావా రాహుల్ గాంధీ..తేల్చుకుందాం? అంటూ ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబు మనకు పెట్టిన టోపీ చాలాదా…మరోసారి తెలంగాణలో పెత్తనం చెలాయిస్తానంటే ఎలా? బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రం మెడలు వంచి తెస్తామని హామి ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు బీమా, పథకాలు ఎక్కడైన అమలు జరుగుతున్నాయా అంటూ వివరించారు. కోటి రత్నాల ఆకుపచ్చ తెలంగాణ రూపొందిచే వరకు తాను పోరాడుతునే ఉంటానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version