color psychology: మీకిష్టమైన కలర్ ను బట్టి మీ ప్లస్ లు, మైనస్ లు తెలుసుకోండి

-

వ్యక్తి ప్రవర్తనను నడవడికను పరిస్థితులు ప్రభావితం చేస్తాయి. చుట్టు పక్కలవారిని బట్టి వ్యక్తి మారుతూ ఉంటాడు.  ఒక వ్యక్తికి నచ్చే కలర్‌ని బట్టి వ్యక్తిత్వాన్ని కలర్‌ సైకాలజీ ద్వారా తెలుసుకోవచ్చునని తాజా సర్వేల సారాంశం. నిజమే తెలుపు రంగు ప్రశాంతతకు, ఎరుపు విప్లవానికి ప్రతీకలు. జాతకాలు, రంగు రాళ్లు వంటి విషయాలను మూఢనమ్మకాలుగా కొట్టేసినా… సైకాలజీ అనే అంశాన్ని మాత్రం చాలావరకు ఆమోదిస్తున్నారు. అలవాట్లను బట్టి వారివారి వ్యక్తిత్త్వాలను, కొన్ని ఇష్టాలను బట్టి వారి వారి ఆటిట్యూడ్ ను, స్పందించే తీరును బట్టి వారి మెచ్యురిటీ లెవల్ ను అటుఇటుగా లెక్కకట్టొచ్చు.! నచ్చిన కలర్ ను బట్టి సదరు వ్యక్తి ప్లస్ లు ,మైనస్ లు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

తెలుపు
Plus మంచి ఆలోచనలు ఉంటాయి, టెన్షన్స్ తక్కువ, ప్రశాంతత ఎక్కువ,
Minus ఎవరిని పడితే వారిని త్వరగా నమ్ముతారు, మోసపోవడం అలవాటు.
పసుపురంగు
Plus తెలివి ఎక్కువ ,నిద్ర ప్రియులు , శృంగార కాముకులు.
Minus ఆరోగ్యాన్ని పట్టించుకోరు, తమనుతాము ఎక్కువగా ఊహించుకుంటారు, కోపం ఎక్కువ.
ఎరుపు
Plus ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. సామాజిక బాధ్యత ఎక్కువ.
Minus తమలాగే ప్రతి ఒక్కరు ఉండాలని అనుకుంటారు. చిన్న విషయానికి గొడవ పెట్టుకుంటారు.
ఆకుపచ్చ
Plus లీడర్ లక్షణాలు ఎక్కువ, అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ప్యూచర్ మీద పక్కా ప్లానింగ్ ఉంటుంది.
Minus ఈర్ష్య, అసూయలు ఎక్కువ, అనుకున్నదానిని సాధించడం కోసం పక్కవాళ్లను ఇబ్బంది పెట్టడానికి కూడా వెనుకాడరు.
లేత నీలం
Plus మెచ్యురిటీ లెవల్స్ ఎక్కువ, ఇట్టే ప్రేమలో పడిపోతారు. మనుషులంటే మంచోళ్లు అనే బేసిక్ ప్రిన్సిపుల్ ఫాలో అవుతారు.
Minus వీరి మంచితనం బయటికి చేతగాని తనంగా కనిపిస్తుంటుంది, వీరి గురించి డెప్త్ గా తెలియనంత వరకు ఫ్రెండ్స్ వీరిని చులకనగా చూస్తుంటారు.
గులాబి
Plus దైవ భక్తి ఎక్కువ, తమదైన వారంలో పక్కగా దేవుడి దర్శనం, పుణ్యక్షేత్రాల పర్యటనను పెట్టుకుంటారు. సహాయం చేయడంలో ముందుంటారు.
Minus మూఢనమ్మకాలు ఎక్కువ, డబ్బును వృథా గా ఖర్చు చేస్తారు.
ఊదా
Plus వ్యాపారవేత్తలుగా ఎదుగుతారు, డబ్బు విలువ తెలిసి వ్యవహరిస్తారు.
Minus అనవసర గొడవలకు కారకులవుతారు.ఇతరులను లెక్క చేయరు.
గోధుమ
Plus ఎందరిలో ఉన్న వీరే సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా ఉంటారు. ఏదో ఒక రంగంలో విశిష్ట ప్రావీణ్యం కలిగి ఉంటారు.
Minus పొగరు, గర్వం అధికం.
కాషాయం
Plus అందం మీద దృష్టి ఎక్కువ, ప్రయాణాలన్న ఇష్టమే…పోటీతత్త్వం ఎక్కువ.
Minus వీరిలో కూాడా ఈర్ష్య , అసూయలు ఎక్కువే, అలసట ఎక్కువ.
బ్లాక్
Plus మొండి ధైర్యం ఎక్కువ, నలుగురిలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని ఆరాడపడతారు. దైవభక్తి తక్కువ.
Minus ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కలుపుగోలు తత్త్వం చాలా తక్కువ.

Read more RELATED
Recommended to you

Exit mobile version