కొన్ని రోజులు చికెన్ తినవద్దు… తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక !

-

కొన్ని రోజులు చికెన్ తినవద్దు..అంటూ తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని రోజులు చికెన్ తినవద్దు..కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన తెలంగాణ ప్రభుత్వం.. అధికారిక ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఇప్పటికే ఈ వ్యాధి తెలంగాణ, ఏపీలకు వ్యాపించినట్లు సమాచారం అందింది.

chicken-revanth

ఈ తరుణంలోనే.. కొన్ని రోజులు చికెన్ తినవద్దు..అంటూ తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇక అటు తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. ఈ తరుణంలోనే… చికెన్ తినొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, భీమడోలు, కొల్లేరు కాకినాడ, ఏలూరులో కోళ్లు చనిపోవడంతో.. కోళ్ల రక్త నమూనాలు తీసి భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపారు పశుసంవర్ధకశాఖ అధికారులు. 15 రోజులుగా వణికిస్తున్న వైరస్‌ ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా H5N1 అని భోపాల్‌లోని యానిమల్‌ డిసీజెస్‌ ల్యాబ్‌ తేల్చింది. తణుకు మండలం వేల్పూరు, పెరవలి మండలం కానూరు గ్రామాల్లో చనిపోయిన కోళ్లకు హెచ్‌5ఎన్‌1 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో… చికెన్ తినొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఏపీలో చికెన్‌ తినే వారి సంఖ్య తగ్గింది. దీంతో రేట్లు కూడా తగ్గిపోయాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version