కేసీఆర్ బర్త్ డే.. ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని బీఆర్‌ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. కేసీఆర్ జన్మదిన సందర్భంగా, మాజీ ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో వృక్షార్చన కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు.
వృక్షార్చన పేరుతో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ రోజు నంది నగర్ నివాసంలో వృక్షార్చన కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ చేశారు కేటీఆర్. ఈ తరునంలోనే.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా వృక్షార్చన కార్యక్రమం చేయనున్నారు గ్రీన్ ఇండియా ఛాలంజ్ వ్యవస్థాపకులు, మాజీ రాజ్య సభ సభ్యుడు సంతోష్ కుమార్. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ జన్మదిన సందర్భంగా మాజీ ఎంపీ @SantoshKumarBRS ఆధ్వర్యంలో నిర్వహించనున్న వృక్షార్చన పోస్టర్ ను ఆవిష్కరించిన కేటీఆర్ pic.twitter.com/62qVHTGkr5
— Sarita Avula (@SaritaAvula) February 11, 2025