మద్యం తాగినా లివర్‌ పాడవకూడదంటే ఇలా చేయండి..!

-

ఇది కలియుగం మాత్రమే కాదు.. జంక్‌ ఫుడ్‌ యుగం కూడా. ఈ జనరేషన్‌ వాళ్లు తినే అంత జంక్‌ఫుడ్‌, అసలు ఇప్పుడు ఉన్నంత ఫాస్ట్ పుడ్‌ ఒకప్పుడు ఎక్కడ ఉండేది. అందుకో అప్పుడు రోగాలు కూడా తక్కువే ఉన్నాయి. మందు తాగుతూ మంచూరియా తింటూ జనాలు వీకెండ్స్‌లో ఎంజాయ్‌ చేస్తుంటారు. మద్యం తాగితే లివర్‌ చెడిపోతుందని తెలుసు అయినా మనకు మద్యం మీద మోజు మాత్రం తగ్గదు. అయితే ఎప్పుడూ మద్యం తాగడం వల్ల వచ్చే లొల్లి గురించే మాట్లాడకుంటాం కదా.. ఈసారి మద్యం తాగినా ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. కనీసం ఇలా చేస్తే వచ్చే నష్టం కాస్తైనా తగ్గొంచవచ్చు కదా..!

లివర్‌ క్లీన్‌గా ఉండే మీరు ఎంత మందు తాగినా ఏం కాదు. లివర్‌ను క్లీన్‌ చేయడానికి నిమ్మ గింజ‌లు మ‌న‌కు ఎంత‌గానో ఉపయోగ‌ప‌డ‌తాయి. సాధార‌ణంగా మ‌నం నిమ్మ‌ర‌సాన్ని పిండిన‌ప్పుడు అందులో ఉండే గింజ‌ల‌ను ప‌డేస్తుంటాం. అవి ప‌ళ్ల కింద ప‌డితే చేదుగా అనిపిస్తాయని. నిమ్మ‌గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల లివ‌ర్ క్లీన్ అవుతుంద‌ని సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. వీటిల్లో ఆల్క‌లాయిడ్స్‌, టానిన్స్‌, ఫ్లేవ‌నాయిడ్స్ ఉంటాయి. ఇవి లివ‌ర్ ఎంజైమ్స్ ఉత్ప‌త్తికి స‌హాయ ప‌డ‌తాయి. దీని వ‌ల్ల లివ‌ర్‌లో ప‌లు ర‌కాల ఎంజైమ్స్ ఉత్ప‌త్తి జ‌రుగుతుంది. ఫ‌లితంగా లివ‌ర్ యాక్టివ్‌గా మారుతుంది. అప్పుడు లివ‌ర్ త‌న‌లో ఉన్న విష ప‌దార్థాలు, కొవ్వును వేగంగా బ‌య‌ట‌కు పంపిస్తుంది. దీంతో లివ‌ర్ క్లీన్ అవుతుంది. ఇలా నిమ్మ గింజ‌ల‌తో మ‌నం లివ‌ర్‌ను శుభ్రం చేసుకోవ‌చ్చు. దీని వ‌ల్ల లివ‌ర్ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది.

లివ‌ర్ వ్యాధులు ఉన్న‌వారికి ఈ గింజ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అలాగే ఈ గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ర‌క్తం కూడా శుద్ధి అవుతుంది. అయితే నిమ్మ గింజ‌ల‌ను రోజూ 4 చొప్పున ఏదో ఒక స‌మ‌యంలో తిన్నా చాలు. లేదంటే భోజ‌నం చేసేట‌ప్పుడు అన్నంలో పెట్టుకుని కూడా తిన‌వ‌చ్చు. చేదుగా ఉన్నాయ‌ని వాటిని ప‌డేయ‌కండి. వాటితో ఎంతో గొప్ప మేలు జ‌రుగుతుంది. రోజూ వాటిని తిన‌డం వ‌ల్ల లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంటుంది. ఇక మందు కొట్టి వచ్చినప్పుడు తెల్లారే ఈ గింజల పొడిని లేదా గింజలు డైరెక్టుగా ఒక స్పూన్‌ మోతాదులో తిన్నారంటే సెట్‌.!! అలా అని మరీ ఎక్కువ తాగకండే.!

Read more RELATED
Recommended to you

Exit mobile version