ఇండియా గేట్ దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధాన చారిత్రక స్మారక చిహ్నం గురించి అందరికీ తెలిసిందే. చాలా మంది ఢిల్లీ వెళ్లినప్పుడు ఇండియా గేట్ ని వెళ్లి సందర్శిస్తూ ఉంటారు. అయితే ఇండియా గేట్ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం తప్పక ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇండియా గేట్ పూర్తి పేరు ఇండియా గేట్ కాదట. మీరు కూడా ఇప్పటి వరకు ఇండియా గేట్ ఏ దీని పూర్తి పేరు అని అనుకుంటున్నారా..? అయితే ఇక మీదట ఇండియా గేట్ పూర్తి పేరు మీరు తెలుసుకోండి.
భారత స్వాతంత్ర పోరాటం మొదటి ప్రపంచ యుద్ధంలో అమరవీరుల జ్ఞాపకార్థంగా ఢిల్లీలో దీనిని నిర్మించడం జరిగింది. ఇండియా గేట్ 42 మీటర్ల ఎత్తు ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ స్మారక చిహ్నంగా పేరు పొందింది. 1914 నుంచి 1921 మధ్య ప్రాణాలను త్యాగం చేసిన 74,187 మంది భారతీయ సైనికుల జ్ఞాపకార్థం తినని నిర్మించడం జరిగింది.
1921లో ప్రారంభమై 1931 వరకు దీనిని నిర్మించారు. ఇన్నేళ్లు ఈ ఇండియా గేట్ ని కట్టడం జరిగింది. సర్ ఎడ్విన్ లూటియన్స్ దీనిని రూపొందించారు. 1931 ఫిబ్రవరి 12న ప్రారంభించబడింది. 13,313 మంది సైనికుల పేర్లు, చెక్కబడి ఉన్నాయి. 12,357 మంది భారతీయులు వీళ్ళలో ఉన్నారు. ఇక ఇండియా గేట్ పూర్తి పేరు ఏంటి అనే విషయానికి వస్తే దీని పూర్తి పేరు ఆల్ ఇండియా వార్ మెమోరియల్ అని తెలుస్తోంది.