ManiPur: మణిపూర్ రాష్ట్రంలో పెను ప్రమాదం జరిగింది. మణిపూర్ రాష్ట్రంలో వాహనం బోల్తా కొట్టింది. ఈ సంఘటన లో ఏకంగా ముగ్గురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి చెందారు.మణిపూర్ రాష్ట్రం సేనాపతి జిల్లా చాంగోబంగ్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లోయలో వాహనం బోల్తా పడిన ఘటనలో ముగ్గురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి చెందారు.
మరో 13 మంది జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక ఈ సంఘటన పై ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. అలాగే… ముగ్గురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి చెందిన నేపథ్యంలో… ఆ మృత దేహాలను పోస్టు మార్టం కోసం పంపారు. అటు ముగ్గురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతికి సంతాపం తెలిపారు.