తినేప్పుడు జపాన్‌ వాళ్లు ఎందుకు మోకాళ్లపై కుర్చుంటారో తెలుసా..?

-

జపాన్‌ వాళ్ల అలవాట్లు అన్నీ భలే వెరైటీగా ఉంటాయి. ఆరోగ్యం పై వారికి చాలా శ్రద్ధ ఉంటుంది. ఈమధ్యే వందేళ్లు బతికే కంట్రీస్‌ లిస్ట్‌లో జపాన్‌ కూడా ఉందని తేలింది. జపాన్‌ వాసులు వాళ్లకు నచ్చిన పని చేస్తూ.. జీవితాన్ని హ్యాపీగా లీడ్‌ చేస్తుంటారట. అందుకే వాళ్లు ఆయుర్థాయం ఎక్కువ ఉందని సైంటిస్టులు అంటున్నారు. మనం భోజనం చేయడం అంటే అయితే నేలపై కుర్చోని తింటాం..లేదా ఛైర్‌లో తింటాం.. కానీ జపాన్‌ వాళ్లు చాలామంది మోకాళ్లపై కూర్చోని తింటారు. హా..అవునా అనిపిస్తుందా..?

ఈ పద్దతిలో వారు భోజనం చేసే టేబుల్స్ చాలా చిన్నవిగా ఉంటాయి. వారు కూర్చునే స్థలంపై టాటామీ మాట్స్‌ను పరుస్తారు. దానిపై మోకాళ్లపై కూర్చుని భోజనం చేస్తారు. కానీ.. ఇలా భోజనం చేయడం చాలా కష్టం. తక్కువ సమయంలోనే కాళ్ళు పట్టేస్తూ ఉంటాయి. భోజనం చేసేటప్పుడు, టీ తాగే సమయాల్లోనూ ఇలా ఇతర సాంప్రదాయ కార్యక్రమాలలో మోకరిల్లి కూర్చోవడం అనేది అక్కడ ఎప్పటినుంచో ఆచారంగా వస్తోందట. అక్కడి ప్రజలు కూడా వాటిని పాటిస్తున్నారు.

కారణం ఏమై ఉండొచ్చు..

చాలా మంది జపనీస్ తినేటప్పుడు మోకరిల్లడానికే ఇష్టపడతారు. ఇలా మోకరిల్లి కూర్చున్నపుడు వంగి ఉండలేరు కాబట్టి అలా కూర్చున్న వ్యక్తుల భుజాలు, వీపు బలంగా ఉంటాయి. వెన్నెముక నిటారుగా ఉంటుంది. ఆరోగ్య రీత్యా కూడా ఇది మేలు చేస్తుందని వారు భావిస్తారు. అందుకే వారు సాంప్రదాయక భోజనాలలో ఇలా కూర్చుంటూ ఉంటారు.

మొత్తానికి అలా వారు ఆ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇది ఒక్కటే కాదు.. జపాన్‌ వాళ్లు ఫాలో అయ్యే చాలా అలవాట్లు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నిజానికి భోజనం అనేది నేలపైన కుర్చోని తింటేనే ఒంటికి బాగా పడుతుందని మన పెద్దోళ్లు చెప్తుంటారు. కానీ ఈరోజుల్లో అలా కూర్చోని తినడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. కొందరికి తినాలి ఉన్నా..అసలు శరీరం సహకరించడం లేదు. ఇక మోకాళ్లపై కుర్చోని తినే కాన్సప్ట్‌ మన దగ్గర అస్సలు వర్కౌట్‌ కాదు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version