ఉచిత రేషన్ స్కీమ్ నిలిపివేయాలని కేంద్రానికి ఆర్థిక శాఖ హెచ్చరిక?

-

కేంద్ర ప్రభుత్వం మార్చి నెలలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన, ఉచిత రేషన్ స్కీమును మరోఆరునెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే సెప్టెంబర్ వరకు ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. భారత ప్రభుత్వం ఈ స్కీమును గతంలోనే తీసుకువచ్చింది. కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉచితంగా ఐదు కేజీల బియ్యాన్ని అందిస్తూ వస్తుంది. దాదాపు 80 కోట్ల మంది ఈ నిర్ణయం వల్ల ఊరట పొందారు. ఇంకా లబ్ధి పొందుతూనే వస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అందించే రేషన్ కు కేంద్రం అదనంగా ఐదు కేజీల బియ్యం ఇస్తోంది. అయితే ఆర్థిక శాఖ ఈ స్కీమ్ పై విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. ప్రభుత్వ ఆర్థిక స్థితిని తిరిగి స్తిరీకరిగించడానికి సెప్టెంబరు లో ఈ పథకాన్ని నిలిపివేయాలని ఆర్థిక శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండేచర్ కేంద్రానికి తెలియజేసింది. అలాగే పన్ను తగ్గింపు వంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరింది. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు అని హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version