దేవాలయాల్లో బూతు బొమ్మలు ఎందుకుంటాయో తెలుసా?

దేవాలయాల్లో బూతు బొమ్మలు ఉండటం ఏంది. అసలు దేవాలయాల్లో బూతు బొమ్మలు ఎందుకు ఉంటాయి. అక్కడ బూతు బొమ్మలను పెట్టడంలో అర్థం ఏంటి.. అనేటువంటి రకరకాల డౌట్లు మనకు వస్తుంటాయి. కానీ.. బూతు బొమ్మలను దేవాలయ గాలి గోపురాల మీద ఎందుకు ఉంటాయో మాత్రం మనకు అర్థం కాదు. ఏ ప్రశ్నకైనా సమాధానం ఉంటుందన్నట్టుగా.. దీనికీ సమాధానం ఉంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సి విషయం.

దేవాలయాల ముందు బూతు బొమ్మలు ఉండటం అనేది కరెక్ట్ పద్ధతి. బూతు కావాలి అనుకున్నవాళ్లు దేవాలయాల్లోకి వెళ్లకూడదు. బూతులు, ఆకర్షణలు మాకేమీ అవసరం లేదు.. అలాగే ఈ బూతు బొమ్మలతో కూడా మాకు సంబంధం లేదు.. మేం దైవ దర్శనం కోసం వచ్చాం. శృంగారం, వయసుకు సంబంధించిన వికారపు చేష్టలు వీటన్నింటినీ మేం అధిగమించాం.. అని అనుకునే వాళ్లే దేవాలయాల్లోకి వెళ్లాలనేది… ఆ బొమ్మల పరమార్థం.

దేవాలయాల మీద బూతు బొమ్మలను భక్తులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాటిని పట్టించుకోకుండా.. దేవుడి దర్శనానికి వెళ్తేనే పుణ్యం దక్కుతుంది. అంతే కానీ.. బూతు బొమ్మలను చూస్తూ.. వాటిని విమర్శిస్తూ… గుడిలోకి వెళ్లేవాళ్లకు ఎటువంటి పుణ్యం దక్కదు. వాళ్లు ఇంకా ఆ బూతులోనే ఉండిపోతారు.